Asianet News TeluguAsianet News Telugu

నేను నంపుసకుడిని, సంసారానికి పనికిరాను.. ఫస్ట్ నైట్ లో భార్యకు షాకిచ్చిన భర్త..

ఎన్ఆర్ఐ సంబంధం అంటూ యువతిని వివాహం చేసుకున్నాడు. తొలిరేయి లోనే భర్త తాను నపుంసకుడు అని చెప్పడంతో ఆ యువతి కంగుతింది.  పైగా అదనపు కట్నం ఇస్తేనే కాపురానికి తీసుకెళతానని భార్య ఆమె తరపు వారిని వేధింపులకు గురి చేయడమే కాకుండా ఇటీవల దాడికి సైతం పాల్పడ్డాడు.

newly married woman complained on husbands impotency in guntur - bsb
Author
hyderabad, First Published Jun 9, 2021, 3:24 PM IST

ఎన్ఆర్ఐ సంబంధం అంటూ యువతిని వివాహం చేసుకున్నాడు. తొలిరేయి లోనే భర్త తాను నపుంసకుడు అని చెప్పడంతో ఆ యువతి కంగుతింది.  పైగా అదనపు కట్నం ఇస్తేనే కాపురానికి తీసుకెళతానని భార్య ఆమె తరపు వారిని వేధింపులకు గురి చేయడమే కాకుండా ఇటీవల దాడికి సైతం పాల్పడ్డాడు.

దీంతో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తెనాలి సమీపంలోని ఎడ్లపాడు కు చెందిన  20 ఏళ్ల యువతికి విజయవాడ ఆటో నగర్ కు చెందిన ప్రైవేట్ కన్సల్టెన్సీ లో పనిచేసే ఓ యువకుడితో ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన తెనాలిలో వివాహం జరిగింది. వరుడి తల్లిదండ్రులు పెళ్ళికొడుకు త్వరలో చదువుకోసం కెనడా వెళతాడని, అక్కడే పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటాడని, పెళ్లి చేసుకుని భార్యనూ తీసుకెళతాడని చెప్పారు.

వీసా, ఇతర పేపర్లన్నీ చూపించడంతో వధువు తల్లిదండ్రులు మంచి సంబంధం అని చెప్పి సుమారు రూ. 10 లక్షల కట్నం... లాంఛనాల కింద మరో పదిలక్షల ఖర్చు చేసి వివాహం చేశారు. వివాహం జరిగిన రోజు రాత్రే కార్యం నిమిత్తం వధువును విజయవాడకు తీసుకెళ్లారు.  తొలిరాత్రి గదిలోకి వెళ్లిన ఆమెకు భర్త తాను నంపుసకుడినని, సంసారానికి పనికి రాను అని చెప్పడంతో కంగుతింది. 

రేపు ఢిల్లీకి వైఎస్ జగన్: అమిత్‌షా సహా పలువురు మంత్రులతో భేటీకి ఛాన్స్...

అంతేకాదు ఈ విషయం బయట ఎవరికీ చెప్పవద్దని ప్రాధేయపడ్డాడు. మరుసటి రోజు విజయవాడలో వారి తల్లిదండ్రులు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రిసెప్షన్ కు వచ్చిన తన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకు వధువు అసలు విషయం చెప్పి బోరున విలపించింది.  దీంతో వధువు తల్లిదండ్రులు తమ కుమార్తెను తెనాలిలోని పుట్టింటికి తీసుకొచ్చేశారు.

 ఆ తర్వాత ఇరు పక్షాల పెద్దలు పలుమార్లు సంప్రదింపులు జరిపారు ఇటీవల విజయవాడలో పెద్దల సమక్షంలో పంచాయతీ జరగ్గా,  రిసెప్షన్ కోసం తాము రూ. 8 లక్షలు ఖర్చు పెట్టామని వాటిని తిరిగి ఇవ్వాలని యువకుడు, అతని తరపు వారు డిమాండ్ చేశారు. అంతకుముందు కొద్ది రోజుల ముందు తెనాలి పినపాడు కు వచ్చిన వీరు యువతి, ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈమేరకు బాధిత యువతి తెనాలి త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం.విజయ్‌కుమార్‌ తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios