ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు సంబంధించిన 11 మంది వైసీపీ ఎమ్మెల్సీలు (YSRCP MLCs) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం మండలి చైర్మన్‌ కార్యాలయంలో కొత్త ఎమ్మెల్సీలతో చైర్మన్‌ మోషేన్‌రాజు (Moshen Raju) ప్రమాణం చేయించారు.  

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు సంబంధించిన 11 మంది వైసీపీ ఎమ్మెల్సీలు (YSRCP MLCs) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం మండలి చైర్మన్‌ కార్యాలయంలో కొత్త ఎమ్మెల్సీలతో చైర్మన్‌ మోషేన్‌రాజు (Moshen Raju) ప్రమాణం చేయించారు. ఏపీలో స్థానిక సంస్థల కోటాలో 8 జిల్లాలోని 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. 

అనంతపురం నుంచి వై.శివరామిరెడ్డి, విజయనగరం నుంచి ఇందుకూరు రఘురాజు, విశాఖపట్నం నుంచి వరుదు కల్యాణి, వంశీకృష్ణయాదవ్‌, తూర్పుగోదావరి నుంచి అనంత ఉదయభాస్కర్‌, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్‌, చిత్తూరు నుంచి భరత్‌ గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మూరుగుడు హనుమంతరావు, ప్రకాశం నుంచి తూమాటి మాధవరావు శాసనమండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. 

ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల శాఖ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ హాజరయ్యారు. 

ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇలా అన్నింటిలోనూ ఆ పార్టీదే పై చేయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ వాహ కొనసాగించింది. ఎటువంటి పోటీ లేకుండా 11 ఎమ్మెల్సీ స్థానాలను సొంతం చేసుకుంది. 11 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండటంతో.. వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు చిన్న గోవిందరెడ్డి, ఇసాక్ బాషా, పాలవలస విక్రాంత్ వర్మలు ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో శాసన మండలిలో వైసీపీ బలం 32కి పెరిగింది.