Asianet News TeluguAsianet News Telugu

డిస్మిస్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్.. అర్దరాత్రి మహిళ ఇంట్లో..!

ఉద్యోగం నుంచి డిస్మిస్‌ అయున ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి హౌసింగ్‌ కాలనీలో లక్ష్మి అనే మహిళ ఇంట్లో ఉన్న ప్రకాష్‌.. లక్ష్మి బంధువులను చూసి పారిపోయే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. 

New Twist In dismissed Anantapur AR constable Prakash Case Row
Author
First Published Sep 2, 2022, 3:12 PM IST

ఉద్యోగం నుంచి డిస్మిస్‌ అయున ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి హౌసింగ్‌ కాలనీలో లక్ష్మి అనే మహిళ ఇంట్లో ఉన్న ప్రకాష్‌.. లక్ష్మి బంధువులను చూసి పారిపోయే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రకాష్‌కు లక్ష్మి భర్త, బంధువులు దేహశుద్ధి చేశారు. లక్ష్మిని ప్రకాష్ లోబరుచుని నగదు, బంగారం అపరిహరించాడని ఆమె భర్త, బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల జోక్యంతో  వివాదం సద్దుమణిగినట్టుగా తెలుస్తోంది. 

అనంతపురం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ డిస్మిస్ వ్యవహారం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాష్ తన వద్ద నుండి రూ. 10 లక్షలు మరియు 30 తులాల బంగారం మోసగించాడని ఆరోపిస్తూ బాధితురాలు బి లక్ష్మి 2019 లో గార్లదిన్నె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
2019 జూలై 22న తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చినప్పుడు ప్రకాష్ తనతో స్నేహం చేశాడని, ఈ కేసులో తనకు సహాయం చేస్తానని హామీ ఇచ్చి తన వద్ద నుంచి డబ్బు, బంగారం తీసుకున్నాడని లక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొంది. తనను పెళ్లి చేసుకుంటానని కూడా హామీ ఇచ్చాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

గార్లదిన్నె పీఎస్‌లో 2019 జూన్‌ 22న కేసు నమోదు చేశారు. ప్రకాష్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ ఎస్పీకి నివేదిక పంపారు. దాని ఆధారంగా 2019 డిసెంబరు 19న ప్రకాష్‌ను సస్పెండ్‌ చేశారు. లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధర్మవరం డీఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన విచారణలో ప్రకాశ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని తేలింది. ఈ క్రమంలోనే అతడిని డిస్మిస్ చేశాం. 

ఇదిలా ఉంటే.. తనపై కుట్ర చేశారని ప్రకాష్ ఆరోపిస్తున్నాడు. “ధైర్యాన్ని ప్రదర్శించినందుకు, 70 వేల మంది పోలీసుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసినందుకు నన్ను సర్వీస్ నుండి తొలగించారు. తప్పుడు ఫిర్యాదుతో గార్లదిన్నె పోలీస్ స్టేషన్‌లో నాపై కేసు నమోదు చేశారు’’ అని ప్రకాష్ చెప్పాడు. మరోవైపు లక్ష్మి కూడా ప్రకాష్‌పై తాను ఎప్పుడూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పేర్కొంది. ప్రకాష్ తన నుంచి 30 తులాల బంగారం,  రూ.10 లక్షలు నగదు తీసుకున్నట్లు పోలీసులు మోపిన అభియోగంలో నిజం లేదని స్పష్టం చేశారు. కానిస్టేబుల్ తనను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని, కక్ష సాధింపులో భాగంగానే తనను అడ్డంపెట్టుకుని ఆయనను డిస్మిస్ చేశారని చెప్పింది. 

అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప, అదనపు ఎస్పీ హనుమంతు, సీసీఎస్‌ డీఎస్పీ మహబూబ్‌ బాషాలపై ప్రకాష్ అనంతపురం టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వీరిపై  పలు ఐపీఎస్‌ సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసు విచారణాధికారిగా చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ సీఎం గంగయ్యను నియమిస్తూ అనంతపురం రేంజ్‌ డీఐజీ రవిప్రకాశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గంగయ్య గురువారం అనంతపురం విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి ప్రకాష్ విచారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విచారణకు హాజరుకావాలని కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను ఫోన్‌లో సంప్రదించామన్నారు. ఆయన అందుబాటులోకి రాకపోవడంతో నోటీసు ఇంటికి, ప్రకాష్‌ ఫోన్‌కు మెసేజ్, వాట్సాప్‌ ద్వారా పంపినట్లు చెప్పారు.  ప్రకాష్ విచారణకు హాజరైతేనే కేసు దర్యాప్తులో పురోగతి ఉంటుందని గంగయ్య చెప్పారు. 

ఇక, ప్రకాష్‌పై 10 కేసులు ఉన్నట్టుగా అదనపు ఎస్పీ నాగేంద్రుడు గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 2008 జూన్‌ 25న ప్రకాష్‌ను ఓసారి సర్వీస్‌ నుంచి తొలగించారని, తర్వాత మళ్లీ తీసుకున్నారని వెల్లడించారు. ప్రకాష్‌పై ఉన్న కేసులు, వాటి విచారణ నివేదికలు, ఇతర రికార్డులు అందజేయాలని విచారణాధికారి డీఎస్పీ గంగయ్య కోరడంతో అందజేశామని చెప్పారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios