లోకేష్ జీ.. సంతాపం వాజ్ పేయీకా.. చంద్రబాబుకా.. చిన్నడౌట్..?

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 20, Aug 2018, 11:59 AM IST
netizens jokes on ap minister lokesh
Highlights

లోకేష్‌ నోరుజారి పార్టీ పరువు తీయడంతో సోషల్‌ మీడియా అంతా జోకులు పేలాయి.  తాజాగా మరోసారి ఆయనపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఏపీ మంత్రి నారా లోకేష్ పై మరోసారి సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. తన ప్రసంగంలోనో అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తూ.. ఆయన సోషల్ మీడియాలో వైరల్ గా మారడం పరిపాటే. గతంలో అంబేడ్కర్‌ జయంతి సభలో పాల్గొని వర్థంతి అంటూ తప్పుగా మాట్లాడడంతో రెండిటికీ తేడా తెలియని లోకేష్‌ అంటూ విమర్శల వర్షం కురిసింది.

మరో సందర్భంలో మతపిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే అంటూ లోకేష్‌ నోరుజారి పార్టీ పరువు తీయడంతో సోషల్‌ మీడియా అంతా జోకులు పేలాయి.  తాజాగా మరోసారి ఆయనపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే...వాజ్‌పేయ్‌ కన్నుమూత సందర్భంగా లోకేష్‌ విడుదల చేసిన సంతాప సందేశంపై సోషల్‌ మీడియాలో మూడు రోజులుగా సెటైర్లు పేలుతున్నాయి. సంతాప సందేశంలో వాజ్‌పేయ్‌ కంటే తన తండ్రి చంద్రబాబు నాయుడినే లోకేష్‌ ఎక్కువగా ప్రస్తావించడంపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. 

 

ఇంతకీ ఈ సంతాప సందేశం ఎవరికి? అంటూ చురకలు అంటిస్తున్నారు. సంతాప సందేశాన్ని కవిత్వంతో ప్రారంభించి చరిత్ర గురించి వివరిస్తూ చివరికి తన తండ్రి పాలన గురించి గొప్పలు చెప్పుకోవడం పట్ల విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఇంకొందరేమో.. మీకు రాజకీయాల పట్ల అవగాహన లేని విషయం మా అందరికీ తెలుసు.. ఈమ్యాటర్ ఎక్కడి నుంచి కాపీ కొట్టారు అంటూ జోకులు వేస్తున్నారు. 

loader