హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖదర్శకుడు రామ్ గోపాల్ వర్మను విజయవాడలో ప్రెస్మీట్ పెట్టకుండా అడ్డుకుంటే ట్విట్టర్ వేదికగా జగన్ స్పందించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

విజయవాడలో విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని  పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది.  పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..!చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..? అంటూ జగన్ ట్వీట్ చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే స్పందించని జగన్ రామ్ గోపాల్ వర్మ ప్రెస్మీట్ ను అడ్డుకుంటే ఏదో జరిగిందని స్పందించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ 20 మందికిపైగా విద్యార్థులు ఇంటర్ పరీక్ష ఫలితాల అవకతవకలపై ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకుంటే మానవతాదృక్పథంతో స్పందించాల్సింది పోయి ఇప్పటి వరకు నోరు మెదపలేదని విమర్శిస్తున్నారు. 

ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారని బాధ్యతగల రాజకీయ నాయకుడుగా ఇప్పటికీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థుల ప్రాణాలు కంటే రాజకీయాలే ముఖ్యమా అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.