నాకు కూడా స్వంత పార్టీ నేతలతో ఇబ్బందులు: నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డే కాదు తాను కూడా స్వంత పార్టీ నేతల నుండి ఇబ్బందులు పడుతున్నట్టుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.ఈ విషయాలపై మరోసారి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆ తర్వాత తాను నిర్ణయం తీసుకుంటానన్నారు.
నెల్లూరు: తాను కూడా స్వంత పార్టీ నేతలతో ఇబ్బంది పడుతున్నానని Nellore Rural MLA, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఈ విషయమై మరోసారి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.
మంగళవారం నాడు kotamreddy sridhar reddy నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్వంత పార్టీ నేతలతో ఇబ్బంది పడినట్టే తాను కూడా ఇబ్బంది పడినట్టుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరించారు. తరచూ పార్టీలు మారే నేతలు తనను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి కూడా అయినా ఆ నేత తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నాడని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు చెప్పకుండానే వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. ఈ విషయాలపై గతంలో కూడా తాను YCP అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు. మరోసారి ఈ విషయమై పిర్యాదు చేస్తానన్నారు. పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటానన్నారు.
వైసీపీలో కీలక నేతలుగా ఉన్న కొందరు తమ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం వదిలేసి ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను బలహీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలోనే పక్క నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని శ్రీధర్ రెడ్డి చెప్పారు.
Prakasam జిల్లాలో వైసీపీ అంటే Balineni Srinivas Reddy, బాలినేని అంటేనే వైసీపీ అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుర్తు చేశారు. మూడు జిల్లాలకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంచార్జీగా ఉన్నాడన్నారు. 22 అసెంబ్లీ నియోజకవర్గాలకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమన్వయకర్తగా కొనసాగుతున్నాడని ఆయన తెలిపారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై TDP, Janasena నేతలు ఆరోపణలు చేయడం అర్ధరహితమన్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి అజాత శత్రువన్నారు.మచ్చలేని నాయకుడు బాలినేని అని శ్రీధర్ రెడ్డి చెప్పారు. అలాంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పై వ్యక్తిత్వ హననానికి పాల్పడడం సరైందికాదన్నారు. వైసీపీ నేతలు కూడా ప్రత్యర్ధులకు మద్దతు పలకడం సరైందికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయాల్లో ఆరోపణలు ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. రాజకీయ విధానాలపై పోరాటం ఉండాలని కోటం రెడ్డి కోరారు. . YSR కు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వీర విధేయుడని ఎమ్మెల్యే ప్రస్తావించారు. YS Jagan కు అండగా నిలిచిన వారిలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒకరని ఆయన చెప్పారు. .ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ వెంట వెళ్లొద్దని బాలినేని శ్రీనివాస్ రెడ్డిని అప్పట్లో చాలా మంది అడ్డుకొనే ప్రయత్నాలు చేసిన విషయాన్ని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుర్తు చేశారు.
also read:నన్ను టార్గెట్ చేసి ఆరోపణలు, సంగతి చూస్తా: మాజీ మంత్రి బాలినేని సంచలనం
పార్టీ కోసం పనిచేసే నేతలను బలహీనం చేయడం ద్వారా వైసీపీలోని కొందరు కీలక నేతలు ఏం సాధించాలనుకుంటున్నారని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.