అమరావతి: ఆంధ్రప్రదేశ్ భూపరిపాలన చీఫ్ కమీషనర్ (సీసీఎల్ఏ) నీరబ్ కుమార్‌ ప్రసాద్‌ కు బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది జగన్ ప్రభుత్వం. ప్రస్తుతం బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ హోదాను అదనపు మిషన్ డైరెక్టర్ గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలలో చెప్పిన సంక్షేమ పథకాల అమలుకు బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టింది. విశాఖ, గుంటూరు సహా 9 ప్రధాన నగరాల్లోని ప్రభుత్వ భూమిని అమ్మడం ద్వారా నవరత్నాల్లో చెప్పిన సంక్షేమ పథకాల అమలుకు డబ్బును సమకూర్చుకోవడం ఇక్కడ ప్రధాన ఉద్దేశం.