Asianet News TeluguAsianet News Telugu

నేడు వైసీపీలోకి నేదురుమల్లి

తమ అనుచురులు, సన్నిహితులతో సుదీర్ఘమంతనాలు జరిపిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఆయన అనుచరులు కూడా వైసీపీలో చేరాలని వత్తిడి తేవడంతో నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

nedurumalli ram kumar reddy today joining into ycp
Author
Hyderabad, First Published Sep 8, 2018, 9:41 AM IST

మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి తనయుడు నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరి రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చినా కాదని రాజీనామా చేశారు. తమ అనుచురులు, సన్నిహితులతో సుదీర్ఘమంతనాలు జరిపిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఆయన అనుచరులు కూడా వైసీపీలో చేరాలని వత్తిడి తేవడంతో నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.


నేడు విశాఖ నగరంలోకి వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేరుకోబోతోంది. గత నెల 14న విశాఖ జిల్లాలోకి ప్రవేశించిన జగన్ పాదయాత్ర దాదాపు అన్ని నియోజకవర్గాలను టచ్ చేస్తూ వెళుతుంది. ఈరోజు విశాఖ నగరంలోకి ప్రవేశిస్తుంది. ఒక్క గాజువాక నియోజకవర్గం మినహా విశాఖ నగరంలోని అన్ని నియోజవర్గాల నుంచి పాదయాత్ర వెళ్లేలా వైసీపీ నేతలు ప్లాన్ చేశారు. కోటనరవ కాలనీ వద్ద జగన్ ప్రవేశించగానే నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరతారు. ఆయన జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. రామ్ కుమార్ రెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios