ఏపీకి చేరుకున్న ద్రౌపది ముర్ము.. ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం.. టూర్ షెడ్యూల్ ఇదే..
బీజేపీ నేతృత్వంలోని ఏన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఏపీ పర్యటనకు వచ్చారు. ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ద్రౌపది ముర్ముకు ఎయిర్‌పోర్టులో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఇతర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.
బీజేపీ నేతృత్వంలోని ఏన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఏపీ పర్యటనకు వచ్చారు. ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ద్రౌపది ముర్ముకు ఎయిర్‌పోర్టులో బీజేపీ నేతలు సోము వీర్రాజ, సీఎం రమేష్, వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి.. ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. ద్రౌపది ముర్ము వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. అక్కడ నుంచి ద్రౌపది ముర్ము, కిషన్ రెడ్డిలు రోడ్డు మార్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లనున్నారు. అక్కడ సీఎం జగన్ ఇచ్చే తేనీటి విందులో ముర్ము పాల్గొననున్నారు. అనంతరం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ వెళ్లనున్నారు. ఆమెతో పాటు సీఎం జగన్ కూడా సీకే కన్వెన్షన్‌కు చేరుకోనున్నారు. అక్కడ వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్న ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోరనున్నారు.
ఈ రోజు సాయంత్రం ద్రౌపది ముర్ముతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో సాయంత్రం సమావేశం అవుతారు. ఈ సమావేశంలో తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొననున్నారు. ఇక, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు ఇస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు సోమవారం వెల్లడించారు. టీడీపీ మొదటి నుంచి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు.
ఇక, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. ఈ నెల 18న బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ జరుగుతుంది. పార్లమెంట్‌తో పాటు, ఆయా రాష్ట్రాల శాసనసభల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను పార్లమెంట్‌కు తరలిస్తారు. ఈ నెల 21వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికలకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు.