ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నిస్సాకోడేరులో అనూ అనే యువతిని  కిడ్నాప్ చేసేందుకు  కారు డ్రైవర్ ప్రయత్నించాడు. కూతురుని కాపాడేందుకు గాను  అనూష తల్లి 10 కి.మీ పాటు తల్లి కారు డోర్‌కు వేలాడుతూ అడ్డుపడింది.

నహీం అనే వ్యక్తి కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. భీమవరంలో టీచర్‌గా అనూష పనిచేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం తల్లితో కలిసి బయటకు వెళ్లింది.

ఆ సమయంలో అనూషను కారులో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో అనూష తల్లి అరుణకుమారి అడ్డుకొనే ప్రయత్నం చేసింది. అరుణకుమారి తల్లి చీర కారు డోర్‌లో చిక్కుకుపోయింది.

అయినా కూడ కారును ఆపకుండానే  పది కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు.దీన్ని గమనించిన స్థానికులు కారును వెంబడించారు. 10 కి.మీ. తర్వాత  నహీంను స్థానికులు పట్టుకొని చితకబాదారు.  ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనూషకు  తను మధ్య ప్రేమ వ్యవహరం సాగుతోందని... కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో  తాను అనూషను తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్టుగా నహీం చెప్పారు.  కానీ  నహీం మాటలను అనూష తోసిపుచ్చింది. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.