పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో సకాలానికి  పారాచూట్ ఓపెన్ కాకపోవడంతో  నేవీ ఉద్యోగి  మృతి చెందాడు. ఈ ఘటన కోల్ కత్తాలో  చోటు  చేసుకుంది.

విజయనగరం: కోల్‌కత్తాలో పారాగ్లైడింగ్ లో విషాదం నెలకొంది. పారాచూట్ సమయానికి తెరుచుకోకపోవడంతో గోవింద్ అనే జవాన్ మృతి చెందాడు. గోవింద్ మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.

విశాఖపట్టణం నేవీలో గోవింద్ పనిచేస్తున్నాడు. పారా గ్లైడింగ్ లో శిక్షణ కోసం కోల్ కత్తా వెళ్లాడు. హెలికాప్టర్ నుండి పారా గ్లైడింగ్ చేస్తున్న సమయంలో సమయానికి పారాచూట్ తెరుచుకోలేదు. దీంతో గోవింద్ మృతి చెందాడు. కళ్లముందే తమ సహచరుడిని కోల్పోవడంతో శిక్షణకు వెళ్లిన జవాన్లు ఆందోళన చెందుతున్నారు. 12 ఏళ్ల క్రితం గోవింద్ నేవీలో చేరాడు. గోవింద్ మరణించిన విషయం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. గోవింద్ మృతి చెందిన విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.