నరసరావుపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live
Narasaraopet assembly elections result 2024: నరసరావుపేట : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో నరసరావుపేటకు ప్రత్యేక స్థానం వుంది. ఇక్కడి నుండి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్య వహించిన కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా, కోడెల శివప్రసాద్ మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా ఎదిగారు. ప్రస్తుతం నరసరావుపేట ఎమ్మెల్యేగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వున్నారు.
Narasaraopet assembly elections result 2024: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో నరసరావుపేట రాజకీయాలు మారిపోయాయి. 1983 లో టిడిపి నుండి పోటీచేసిన సామాన్య డాక్టర్ కోడెల శివప్రసాద్ ఆ తర్వాత నరసరావుపేటలో పాతుకుపోయారు. వరుసగా ఐదుసార్లు(1983 నుండి 2004 వరకు) ఆయనే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
అయితే టిడిపికి కంచుకోటగా వున్న నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వైసిపి జెండా ఎగరేసారు. ఆయనకూడా వైసిపి పోటీచేసిన రెండుసార్లు (2014, 2019) విజేతగా నిలిచారు. ఇలా టిడిపి, వైసిపి సమఉజ్జీలుగా నిలిచిన నరసరావుపేట ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
నరసరావుపేట నియోజకవర్గంలోని మండలాలు :
నరసరావుపేట
రొంపిచర్ల
నరసరావుపేట అసెంబ్లీ ఓటర్లు ((2019 ఎన్నికల వివరాల ప్రకారం)
నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 221728
పురుషులు 108730
మహిళలు 112960
నరసరావుపేట అభ్యర్థులు
నరసరావుపేటలో వైసీపీ తరుపున గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి బరిలో నిలువగా.. కూటమి తరుపున చదలవాడ అరవిందబాబు పోటీలో నిలిచారు.
నరసరావుపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
నరసరావుపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
నరసరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో YSRCPకి చెందిన డాక్టర్ గోపరెడ్డి శ్రీనివాస రెడ్డిపై తెలుగుదేశం పార్టీకి చెందిన అరవిందబాబు చదలవాడ 19705 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
నరసరావుపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019 :
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019 లో నరసరావుపేట నియోజకవర్గం వైసిపి వశమయ్యింది. ఈ ఎన్నికల్లో 1,83,511 (82 శాతం) ఓట్లు పోలవగా అత్యధిక ఓట్లు వైసిపికి వచ్చాయి.
వైసిపి - గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి - 1,00,994 (55 శాతం) - 32,277 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - చదలవాడ అరవింద్ బాబు -68,717 (37 శాతం) - ఓటమి
జనసేన - జిలాని సయ్యద్ - 8,746 (4 శాతం) -మూడోస్థానం
నరసరావుపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2014 :
ఈ ఎన్నికల్లో 1,65,255 (84 శాతం) ఓట్లు పోలయ్యాయి.
వైసిపి - గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి - 87,761 (53 శాతం) - 15,766 ఓట్ల మెజారిటీతో విజయం
బిజెపి - నల్లబోతు వెంకటరావు -71,995 (43 శాతం) - ఓటమి (రెండో స్థానం)