Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ తో ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ: మీడియం రగడపై వివరణ

సీఎం జగన్ ను ఎంపీ రఘురామకృష్ణంరాజు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీ రఘురామకృష్ణంరాజుతోపాటు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు ఉన్నారు. లోక్ సభలో తెలుగుమీడియంపై చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణంరాజు వివరణ ఇవ్వనున్నారు.

narasapuram ysrcp mp raghurama krishnam raju met cm ys jagan
Author
Amaravathi, First Published Nov 22, 2019, 6:16 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. రఘురామకృష్ణంరాజుపై సీఎం జగన్ ఆగ్రహంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు. 

ఈ వ్యవహారం కాస్త దుమారం రేపుతోంది. ఇలాంటి తరుణంలో లోక్ సభలో తెలుగు మీడియంపై రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు చేయడంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ ను ఎంపీ రఘురామకృష్ణంరాజు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీ రఘురామకృష్ణంరాజుతోపాటు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు ఉన్నారు. లోక్ సభలో తెలుగుమీడియంపై చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణంరాజు వివరణ ఇవ్వనున్నారు.

ఇంగ్లీష్ మీడియంపై వ్యాఖ్యలు: రఘురామకృష్ణంరాజుపై జగన్ సీరియస్

ఇకపోతే ఏపీలో జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా పట్టించుకోకుండా ఇంగ్లీషు మీడియం అమలుకు మార్గదర్శకాలు విడుదల చేశారు సీఎం జగన్. 

ఇలాంటి తరుణంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్ సభలో తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పీవీ నరసింహరావు హయాంలో ఏర్పాటు చేసిన తెలుగు అకాడమీ ఇప్పటికీ విజయవంతంగా నడుస్తోందన్నారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక తెలుగు అకాడమీ తెలంగాణలో కొనసాగుతోందని ఏపీలో మాత్రం గత ఐదేళ్లలో గత టీడీపీ ప్రభుత్వం తెలుగు అకాడమీని ఏర్పాటు చేయలేదని చెప్పుకొచ్చారు. 

జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తెలుగు అకాడమీని ఏర్పాటు చేసి చైర్‌పర్సన్‌గా లక్ష్మీ పార్వతిని నియమించారని చెప్పుకొచ్చారు. తెలుగుజాతి కీర్తిని ప్రపంచానికి తెలియజేసిన దివంగత సీఎం ఎన్టీఆర్ సతీమణిని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నియమించారని చెప్పుకొచ్చారు.  

తెలుగు అకాడమీకి సంబంధించి గతంలో విడుదలైన నిధులు హైదరాబాద్‌లో ఉన్నాయని ఏపీ విభజన చట్టం 10వ షెడ్యూల్ ప్రకారం ఈ నిధులను 58 : 42 నిష్పత్తి ప్రకారం విభజించి ఏపీకి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. 

ప్రాచీన తెలుగు భాషను, సంస్కృతిని అభివృద్ధి చేస్తామన్న ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలుగు భాష ప్రాముఖ్యాన్ని తెలిపే ఆర్టికల్ 350, 350 A ప్రకారం తెలుగు భాషను అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా సహకరించాలని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశారు. 

రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశంపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్న తరుణంలో రఘురామకృష్ణంరాజు ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. 

ఇంట్రెస్టింగ్: వైసీపీ ఎంపీకి జగన్ క్లాస్, బాగున్నారా అంటూ ఆ ఎంపీ భుజం తట్టిన మోదీ

Follow Us:
Download App:
  • android
  • ios