నరసాపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live
ఆంధ్ర ప్రదేశ్ లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నరసాపురం ఒకటి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ముదూనూరి ప్రసాదరాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కంచుకోటను బద్దలుగొట్టి వైసిపి విజయం సాధించింది. మరి ఈసారి నరసాపురం ఫలితం ఆసక్తికరంగా మారింది.
నరసాపురం రాజకీయాలు :
పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి బలంగా వున్న నియోజకవర్గాల్లో నరసాపురం ఒకటి. పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటివరకు కేవలం మూడుసార్లు మాత్రమే టిడిపి నరసాపురంలో ఓడిపోయింది. 1983, 85 లో వరుసగా చేగొండి హరిరామ జోగయ్య... 1989, 94,99,2004 లో కొత్తపల్లి సుబ్బరాయుడు టిడిపి నుండి గెలిచారు. 2014 లో బండడడారు మాధవ నాయుడు టిడిపి నుండి పోటీచేసి గెలిచారు.
అయితే 2019 లో వైసిపి రాష్ట్రవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది... ఈ క్రమంలోనే ముదునూరి ప్రసాద్ రాజు కూడా నరసాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనే ఈసారి కూడా నరసాపురంలో పోటీ చేస్తున్నారు.
నరసాపురం నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. మొగల్తూరు
2. నరసాపురం
నరసాపురం అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 1,68,187
పురుషులు - 83,747
మహిళలు - 84,439
నరసాపురం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
సిట్టింగ్ ఎమ్మెల్యే ముదునూరి నాగరాజ వరప్రసాదరాజుకే మరోసారి నరసాపురం వైసిపి టికెట్ దక్కింది.
జనసేన అభ్యర్థి :
పొత్తులో భాగంగా జనసేన పార్టీకి నరసాపురం టికెట్ దక్కింది. దీంతో ఇక్కడినుండి బొమ్మిడి నాయకర్ ను పోటీ చేయిస్తున్నారు పవన్ కల్యాణ్.
నరసాపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
నరసాపురం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,36,556 (81 శాతం)
వైసిపి - ముదునూరి ప్రసాదరాజు - 55,556 ఓట్లు (40 శాతం) - 6,436 ఓట్ల మెజారిటీతో విజయం
జనసేన పార్టీ - బొమ్మిడి నాయకర్ - 49,120 (35.97 శాతం) - ఓటమి
టిడిపి - బండారు మాధవనాయుడు - 27,059 (19 శాతం) - ఓటమి
నరసాపురం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,29,913 (81 శాతం)
టిడిపి - బండారు మాధవనాయుడు - 72,747 (56 శాతం) - 21,712 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - కొత్తపల్లి సుబ్బరాయుడు - 51,035 (39 శాతం) - ఓటమి
- Andhra Pradesh Assembly Elections 2024
- Andhra Pradesh Congress
- Andhra Pradesh Elections 2024
- BJP
- Bommidi Nayakar
- JSP
- Janasena
- Janasena Party
- Mudunuri Nagaraja Varaprasad Raju
- Mudunuri Varaprasad
- Nara Chandrababu Naidu
- Narasapuram MLA
- Narasapuram Politics
- Narasapuram assembly elections result 2024
- Pawan Kalyan
- TDP
- TDP Janasena Alliance
- Telugu Desam party
- Telugu News
- YCP
- YS Jaganmohan Reddy
- YSR Congress Party
- YSRCP