తమపొలాన్ని వైసిపి నాయకుడు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి కబ్జా చేశారని, ఇది అన్యాయం అని నిలదీస్తే మైదుకూరు సీఐ కొండారెడ్డి ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నారని కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన వైసీపీ కార్యకర్త అక్బర్ బాషా ఆందోళన వ్యక్తం చేశారు.
కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన వైసీపీ కార్యకర్త అక్బర్ బాషా..తనకు అన్యాయం జరిగిందంటూ.. ఆత్మహత్య చేసుకుని చనిపోతానంటూ.. చేసినసెల్పీ వీడియో కలకలం రేపింది. దీనిమీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు మండిపడ్డారు.
"
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ‘మైదుకూరులో జగన్ రెడ్డి బంధువు తిరుపాల్ రెడ్డి ముస్లిం మైనారిటీ అయిన అక్బర్ భాషా భూమిని కబ్జా చేసినట్టు తెలిసింది. ఈ మధ్య కొందరు పోలీసులు తమ విధుల్ని పక్కనపెట్టి సివిల్ పంచాయితీల్లో తలదూర్చడం మామూలైపోయింది.
ఇక్కడ కూడా తిరుపాల్ రెడ్డి వర్గానికి చెందిన సిఐ ఒకరు, అక్బర్ ను స్టేషన్లో కూర్చోబెట్టి, అతని పొలంలో దౌర్జన్యంగా నాట్లు వేయించారు. పైగా ఎన్ కౌంటర్ చేస్తానని బాధితుడిని బెదిరించడం ఇంకా దారుణం. న్యాయం చేయాల్సిన పోలీసులే బాధితుడిపై దౌర్జన్యానికి దిగితే సామాన్యుడికి ఇంకెవరు దిక్కు?’ అని వాపోయారు.
‘గతంలో నంద్యాలలో సలీం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు అక్బర్ కుటుంబం కూడా తమకు అదే మార్గం దిక్కంటోంది. అక్బర్ మీరు ధైర్యంగా ఉండండి. తెలుగుదేశం మీకు అండగా ఉంది. ప్రభుత్వం వెంటనే అక్బర్ కుటుంబానికి న్యాయం చేయాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని చంద్రబాబు ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.
దీనిమీద నారాలోకేష్ స్పందిస్తూ... ‘తమపొలాన్ని వైసిపి నాయకుడు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి కబ్జా చేశారని, ఇది అన్యాయం అని నిలదీస్తే మైదుకూరు సీఐ కొండారెడ్డి ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నారని కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన వైసీపీ కార్యకర్త అక్బర్ బాషా ఆందోళన వ్యక్తం చేశారు.
జగన్‌రెడ్డి బంధువులు, పార్టీ నేతలకు అధికారమే ఆయుధమైంది. చట్టం చుట్టమైంది. పోలీస్‌వ్యవస్థని జగన్‌రెడ్డి ఫ్యాక్షన్ సైన్యంగా మార్చుకుంటున్నారు. వారి కన్నుపడితే కబ్జా, ఆశపడితే ఆక్రమణ. ఇదేంటని నిలదీస్తే నిర్బంధం. కబ్జాలపై పోరాడితే పోలీసు చిత్రహింసలు. ఇదీ ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న రాక్షస రాజ్యం’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుకు పడ్డారు.
తమపొలాన్ని వైసిపి నాయకుడు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి కబ్జా చేశారని, ఇది అన్యాయం అని నిలదీస్తే మైదుకూరు సీఐ కొండారెడ్డి ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నారని కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన వైసీపీ కార్యకర్త అక్బర్ బాషా ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం సొంత జిల్లా, సీఎం సొంత పార్టీ కార్యకర్త బాషాయే వైసీపీ నేతల అరాచకాలకు తాళలేక కుటుంబంతోసహా ఆత్మహత్య చేసుకుంటామని రోదిస్తున్నారంటే..రాష్ట్రంలో ఏ స్థాయి దౌర్జన్యాలు సాగుతున్నాయో అర్థం అవుతోందంటూ నారా లోకేష్ మండి పడ్డారు.
నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి అంతం చేశారు. మరో ముస్లిం మైనారిటీ కుటుంబం ఉసురుపోసుకోవద్దు. ముస్లింలంటే ఎందుకింత కక్ష ముఖ్యమంత్రి గారూ ? అంటూ ప్రశ్నించారు నారా లోకేష్.
