స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ నేతలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ నేతలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీతో పాటు పలుచోట్ల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా అక్టోబర్ 2(గాంధీ జయంతి)న టీడీపీ నేతలు కొందరు ఒక్క రోజు నిరహార దీక్షకు సిద్దమవుతున్నారు. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబే స్వయంగా ఒక్కరోజు దీక్ష చేపట్టనుండగా.. ఆయన సతీమణి భువనేశ్వరి కూడా రాజమండ్రిలోని క్యాంప్ సైట్‌లో ఒక్క రోజు నిరహార దీక్షకు కూర్చొనున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే చంద్రబాబు, భువనేశ్వరిల దీక్షలకు మద్దతుగా ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టాలని లోకేష్ నిర్ణయించారు. టీడీపీ ఎంపీ కనకమేడల నివాసంలో లోకేశ్ దీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ దీక్షలో టీడీపీ ఎంపీలతో పాటు, ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పార్టీ నేతలు పాల్గొనబోతున్నారు. ఇదిలాఉంటే, రేపు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని నిరసన దీక్ష చేపట్టేందుకు సిద్దమయ్యారు.