విజయవాడ: వచ్చే ఎన్నికల్లో కూడా తాను మంగళగిరి నుంచే పోటీ చేస్తానని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని ఆయన అన్నారు. మంగ‌ళ‌గిరిలో పోటీ చేస్తున్నప్పుడు రాంగ్‌ సెలక్షన్‌ అన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అదే అంటున్నారని చెప్పారు. తనను కలిసిన కార్యకర్తలతో ఆయన మాట్లాడారు.

కానీ తాను మాత్రం మంగళగిరి నుంచి పోటీ చేయడమే అదృష్టంగా భావిస్తానని లోకేష్ అన్నారు. మంగళగిరి తనకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చిందని చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళిక‌లు సిద్ధం చేశామని అన్నారు. ఓడిపోయినప్పిటకీ ప్రణాళికల అమలుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్ాచరు. త్వరలో నియోజకవర్గంలో పర్యటిస్తానని, ప్రతి ఊరు సందర్శిస్తానని హామీ ఇచ్చారు. 

ప్రజాస్వామ్యంలో జయాపజయాలు సహజమని ఆయన అన్నారు. ఏ క‌ష్టం వ‌చ్చినా కుటుంబ‌ స‌భ్యుడిగా అండ‌గా ఉంటానని ధైర్యం చెప్పారు. ఎప్పుడూ తన ఇంటి త‌లుపులు తెరిచే ఉంటాయని లోకేష్ భరోసా ఇచ్చారు.