త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నూటికి నూరుశాతం ఓడిపోతారన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి నారా లోకేశ్ కౌంటరిచ్చారు
త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నూటికి నూరుశాతం ఓడిపోతారన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి నారా లోకేశ్ కౌంటరిచ్చారు.
ట్వీట్టర్ వేదికగా కేటీఆర్‌పై విరుచుకుపడిన ఆయన... ‘‘ఢిల్లీ మోడీగారు.. తెలంగాణ మోడీ కేసీఆర్, ఆంధ్రా మోడీ జగన్ గారికి కలలో కూడా చంద్రబాబే గుర్తుకొస్తున్నారన్న విషయం శనివారం కేటీఆర్ గారి మాటల్లో బయటపడిందంటూ ఎద్దేవా చేశారు.
ఫెడరల్ ఫ్రంట్ అంటూ చక్రం తిప్పి చివరికి 420 పార్టీతో జత కట్టిన కేసీఆర్... తెలంగాణకే పరిమితమై చతికిలపడ్డారని ఆరోపించారు. ఒక్క నాయకుడిని ఎదుర్కోలేక ముగ్గురు నాయకులు ఒక్కటై ఎన్నో కుట్రలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
అభివృద్ధి, సంక్షేమంలో పోటీ పడలేక, జగన్‌తో చేతులు కలిపి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే భారీ ప్రణాళికలతో టీఆర్ఎస్ ముందుకొస్తున్న విషయం ఇవాళ కేటీఆర్ మాటల్లో తేలిపోయిందన్నారు. టీడీపీ ఓటమి కోసం కృషి చేసే కేసీఆర్ ఆయన సహచరులకు భంగపాటు తప్పదు. ఇది తథ్యమంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
ఢిల్లీ మోడీ గారు, తెలంగాణ మోడీ కేసిఆర్ గారు, ఆంధ్రా మోడీ జగన్ గారికి కలలో కూడా చంద్రబాబు గారే గుర్తుకొస్తున్నారు అన్న విషయం ఈ రోజు @KTRTRS గారి మాటల్లో బయటపడింది
ఫెడరల్ ఫ్రంట్ అంటూ చక్రం తిప్పి 420 పార్టీతో జత కట్టిన కేసీఆర్ గారు తెలంగాణకే పరిమితమై చతికలపడ్డారు pic.twitter.com/CiEanIc7lC
