Asianet News TeluguAsianet News Telugu

అచ్చెన్నాయుడి అరెస్ట్ : రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ట.. మండిపడ్డ లోకేష్..

పంచాయతీ ఎన్నికల సందర్భంగా అచ్చెన్నాయుడి అరెస్ట్ రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ట అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. నిమ్మాడలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. 

nara lokesh serious on ys jagan over atchannaidu arrest - bsb
Author
hyderabad, First Published Feb 2, 2021, 9:31 AM IST

పంచాయతీ ఎన్నికల సందర్భంగా అచ్చెన్నాయుడి అరెస్ట్ రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ట అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. నిమ్మాడలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే జగన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నిమ్మాడలోని అచ్చెన్నాయుడు ఇంటిపైకి రాడ్లు, కత్తులతో దాడికి వెళ్ళిన వైకాపా నేత దువ్వాడ శ్రీనివాస్,అతని అనుచరుల పై పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చెయ్యలేదని దుయ్యబట్టారు. 

నిన్న తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట మండలం,గొల్లలగుంట గ్రామంలో టిడిపి బలపర్చిన సర్పంచి అభ్యర్థి పుష్పవతి భర్త శ్రీనివాసరెడ్డిని హత్య చేశారు. ఈ రోజు  అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసారు. ఎన్ని కుట్రలు చేసినా పంచాయతీ ఎన్నికల్లో నియంత జగన్ రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం అని నారా లోకేష్ హెచ్చరించారు. 

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆంద్రప్రదేశ్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె. అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఆయనను పోలీసులు అరెస్టు చేసి కోటబొమ్మాళి స్టేషన్ కు తరలించారు. నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థిని బెదిరించాడనే ఆరోపణపై కోటబొమ్మాళి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.

బెదిరింపులు: టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి అరెస్టు...

దాంతో అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిమ్మాడ అచ్చెన్నాయుడి స్వగ్రామం. దాంతో సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలని అచ్చెన్నాయుడు భావించారు. అయితే, వైసీపీ మద్దతుదారుడు నామినేషన్ వేయడానికి ముందుకు వచ్చాడు. దీంతో ఆయనను అచ్చెన్నాయుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దువ్వాడ శ్రీనివాస్, అప్పన్న కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అచ్చెన్నాయుడు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ సోమవారం వైసీపీ నేతలు ఎన్నిక సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. అచ్చెన్నాయుడిని అరెస్టు చేయాలని వారు డిమాడ్ చేశారు.

తాను ఎవరినీ బెదిరించలేదని అచ్చెన్నాయుడు అంటున్నారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడిని అరెస్టు చేనిన తర్వాత భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి దశలో నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఈ రోజు రెండో విడతలో నామినేషన్ల పర్వం మొదలవుతుంది.
 

అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios