హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై స్పందిస్తూ సీఎం జగన్, వైసిపి గవర్నమెంట్ పై నారా లోకేష్ సీరియస్ అయ్యారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాల విషయంలో జగన్ సర్కార్ దారుణంగా వ్యవహరిస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. హిందూదర్మాన్ని మంటగలిపేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు విస్తరణ పేరిట ఆలయాన్ని ధ్వంసం చేసారంటూ లోకేష్ సోషల్ మీడియా వేదికన ఆగ్రహం వ్యక్తం చేసారు. 

''ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల ఇలవేల్పు, ఉత్కళాంధ్రుల‌ ఆరాధ్యదైవం పాత‌ప‌ట్నంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో ప్రధాన రహదారి వైపు ఉన్న ప్రహరీతో పాటు, ముందు సింహ‌ద్వారాన్ని కూల్చివేయ‌డం దారుణం'' అన్నారు nara lokesh.

Scroll to load tweet…

''ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌రెడ్డికి పాల‌న‌లో అంత‌ర్వేది ర‌థం ద‌గ్ధం, రామ‌తీర్థంలో రాముడివిగ్ర‌హం త‌ల ధ్వంసం, ఒక‌టేమిటి రెండున్న‌రేళ్ల పాల‌న‌లో హిందూధ‌ర్మం మంట‌గ‌లిసింది. దేవుళ్ల‌కి తీర‌ని అప‌చారం త‌ల‌పెట్టారు'' అని ఆవేదన వ్యక్తం చేసారు. 

read more తిరుపతిలో వర్షబీభత్సం: వరదలో చిక్కుకున్న వాహనం, ఓ మహిళ మృతి

''రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల పేరుతో అదే పాత‌ప‌ట్నంలో ఆంజ‌నేయ‌స్వామి, వినాయ‌కగుడిలో విగ్ర‌హాలు త‌ర‌లించుకుంటామ‌ని వేడుకున్నా స‌మ‌యం ఇవ్వ‌కుండా బుల్డోజ‌ర్ల‌తో కూల్చేయ‌డం ప్ర‌భుత్వపెద్ద‌లు హిందువుల ఆల‌యాల ప‌ట్ల ఎంత నిర్ద‌య‌గా ఉన్నారో అర్థం అవుతోంది'' అని ఆందోళన వ్యక్తం చేసారు.

''వైసీపీ ఎమ్మెల్యేకి ఆల‌యాల ధ్వంసం స‌మాచారం ఇచ్చినా, ప‌ట్టించుకోలేద‌ని భ‌క్తులు ఆవేద‌న వ్య‌క్తం చేశారంటే, ఇది ముమ్మాటికీ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు తెలిసి చేసిన విధ్వంస‌మే'' అని నారా లోకేష్ ఆరోపించారు.