ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి మనవడి పుట్టిన రోజు సందర్భంగా తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మాతృశ్రీ తరిగొండ వెంగ‌మాంబ నిత్యాన్న‌దాన భ‌వ‌నంలో ఈ అన్నదానం నిర్వహించారు. 

టీడీపీ (TDP) అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు (ap ex cm chandrababu naidu) నాయుడి మ‌న‌వ‌డు, లోకేశ్ (lokesh) కుమారుడు దేవాన్ష్ (devansh) పుట్టిన రోజు నేప‌థ్యంలో తిరుప‌తిలో అన్న‌దానం నిర్వ‌హించారు. ప్ర‌తీ సంవ‌త్స‌రం దేవాన్ష్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా శ్రీవారి భ‌క్తుల‌కు చంద్ర‌బాబు నాయుడి కుటుంబం అన్న‌దానం నిర్వ‌హిస్తుంటుంది.

పుట్టిన రోజు సంద‌ర్భంగా తిరుమ‌ల అన్న‌దానం కాంప్లెక్స్ (tirumala annadanam complex)లో అన్న‌దానం విత‌ర‌ణ చేప‌డుతారు. దీనికి ప్ర‌తీ సంవ‌త్స‌రం సుమారు 30 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంది. దీని కోసం చంద్ర‌బాబు నాయుడి కుటుంబం రూ.30 ల‌క్షలు విరాళంగా అందిస్తూ ఉంటుంది. ఈ సారి కూడా అలాగే రూ.30 ల‌క్ష‌ల‌ను అందించింది. సోమ‌వారం పొద్దున నుంచి రాత్రి వ‌ర‌కు మాతృశ్రీ తరిగొండ వెంగ‌మాంబ నిత్యాన్న‌దాన భ‌వ‌నం (Matrusri Tarigonda Vengamamba Anna Prasada Center)లో అన్న‌దానం చేశారు. వేంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన భ‌క్తులంద‌రికీ దీనిని అందించారు. మాస్ట‌ర్ నారా దేవాన్ష్ పేరిట ఈ అన్న‌దాన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని ఆ భ‌వ‌నంలోని బోర్డులో పేర్కొన్నారు.