భయపడకండి... వారిని చెప్పులతో తరిమే రోజులు దగ్గర్లోనే..: నారా లోకేష్ సీరియస్

పాలక పార్టీ నాయకులే ఫ్యాక్షనిస్టుల కంటే ఘోరంగా దాడులు చేస్తున్నారని... ఇంత అరాచకం జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారని  నారా లోకేష్ ప్రశ్నించారు.  

Nara Lokesh reacts on YCP supporters attack on Telugu Yuvatha Leader AKP

నంద్యాల : అధికార అండతో కొందరు వైసిపి నాయకులు సైకోల్లా ప్రవర్తిస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. తాజాగా నంద్యాల జిల్లా కొలిమిగండ్లలో తెలుగు యువత అధికార ప్రతినిధి మంద విజయ్ గోపాల్ పై జరిగిన దాడిని లోకేష్ ఖండించారు. రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తూ తమ నాయకులపై దాడిచేస్తున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని లోకేష్ హెచ్చరించారు. 

తెలుగు యువత నాయకుడు విజయ్ గోపాల్ ను వైసిపి సైకోలు చెప్పులతో కొట్టి అవమానించారని... అవే చెప్పులతో ప్రజలే వారిని తరిమితరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే వున్నాయని లోకేష్ అన్నారు. పాలక పార్టీ నాయకులే ఫ్యాక్షనిస్టుల కంటే ఘోరంగా దాడులు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. ఇలా రాజకీక కక్షసాధింపులో అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని లోకేష్ అన్నారు. 

ప్రతిపక్ష టిడిపి నాయకులపై వైసిపి నాయకులు వరుసగా దాడులు చేస్తుంటే శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ఏం చేస్తున్నట్లు? అని లోకేష్ ప్రశ్నించారు. దాడులకు గురయిన బాధితులపైనే రివర్స్ కేసులు బనాయించడం సిగ్గుచేటని అన్నారు. పోలీసులు తీరు ప్రభుత్వ ఉద్యోగుల్లా కాకుండా వైసిపి నాయకుల్లా వుందని మండిపడ్డారు. 

Read More  నేడు టిడిపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటీ... ఈ అంశాలపై చర్చించి నిర్ణయం

ఇదిలావుంటే ఇటీవల తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టిడిపి నేతపై జరిగిన దాడిపై లోకేష్ తీవ్రంగా స్పందించారు. భీమవరం గ్రామ టిడిపి అధ్యక్షుడు మునిరత్నం నాయుడిపై స్థానిక వైసిపి నాయకుడు కొటాల చంద్రశేఖర్ రెడ్డి అనుచరులతో కలిసి రాళ్లదాడికి దిగాడు. ఈ దాడిలో మునిరత్నం తీవ్రంగా గాయపడి కిందపడిపోగా అతడి చేతికున్న ఉంగరాలు, కడియంతో పాటు జేబులోని పదివేల రూపాయలను చంద్రశేఖర్ రెడ్డి, అనుచరులు ఎత్తుకెళ్లారట. ఈ ఘటనపై లోకేష్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. వైసిపి ఫ్యాక్షన్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు.

మునిరత్నంపై వైసిపి నేత హత్యాయత్నానికి పాల్పడటం దారుణమని లోకేష్ అన్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మునిరత్నం ఆరోగ్య పరిస్థితి విషమంగా వుండటంపై లోకేష్ ఆందోళన వ్యక్తం చేసారు. అతడు త్వరగా కోలకోవాలని... పార్టీ అన్నివిధాలుగా అండగా వుంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios