Asianet News TeluguAsianet News Telugu

జగన్ రెడ్డీ... రక్తంతో పల్నాడును సస్యశ్యామలం చేస్తావా..: టిడిపి నేత హత్యపై లోకేష్ సీరియస్

పల్నాడును సస్యశ్యామలం చేయడమంటే రక్తం పారించడమా జగన్ రెడ్డి? అంటూ గురజాల మండలంలో టిడిపి నేత రామాారావు హత్యపై స్పందిస్తూ లోకేష్ ప్రశ్నించారు.

Nara Lokesh reacts on TDP Leader murder in Palnadu AKP
Author
First Published Nov 19, 2023, 2:18 PM IST

పల్నాడు : అధికార వైసిపి తమపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టులు చేస్తోందని... కింది స్థాయిలో అయితే మరీ అరాచకంగా ప్రాణాలు తీస్తున్నారని టిడిపి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా తాజాగా పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత రామారావు హత్యకు కూడా వైసిపి నేతలే కారణమని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా రామారావు హత్యపై స్పందించారు.

అధికార అండతో వైసిపి చేస్తున్న నెత్తుటి దాహానికి అడ్డూఅదుపు లేకుండా పోతోందని లోకేష్ అన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం కొత్తఅంబాపురంలో టీడీపీ నేత పత్తి రామారావును వైసిపి రౌడీ మూకలు దారుణంగా హత్య చేసారని లోకేష్ ఆరోపించారు. వివాదరహితుడు, టిడిపి పార్టీ కోసం పనిచేసే రామారావును హత్యచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేష్ అన్నారు. 

పల్నాడును సస్యశ్యామలం చేయడమంటే రక్తం పారించడమా జగన్ రెడ్డి? అని లోకేష్ ప్రశ్నించారు. వైసిపికి రోజులు దగ్గరపడే టిడిపి కార్యకార్తలపై రోజుకో దాడి, హత్యలకు పాల్పడుతోందని అన్నారు. రామారావు హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేసారు. రామారావు కుటుంబానికి టీడీపీ అన్నివిధాలా అండగా ఉంటుందని లోకేష్ అన్నారు. 

అసలేం జరిగింది :

పల్నాడు జిల్లా గురజాల మండలం కొత్త అంబాపురం గ్రామానికి చెందిన పత్తి రామారావు(73) టిడిపి నాయకుడు. అయితే అతడికి ఇద్దరు కొడుకులు. ఒకరు విదేశాల్లో వుండగా మరొకరు హైదరాబాద్ లో వుంటున్నాడు. భార్య కూడా కొడుకుల వద్దే వుంటుండగా అతడొక్కడే అంబాపురంలో వుంటున్నాడు. ఈ క్రమంలో అతడు ఇంట్లో ఒంటరిగా వుండగా దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు గొంతు కోసం దారుణంగా హతమార్చారు. 

స్థానికుల ద్వారా రామారావు హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసారు. అతడి హత్యకు ఆస్తి తగాదాలే కారణమని స్థానికులు అంటుంటే... రాజకీయ కక్షసాధింపే హత్యకు కారణమని టిడిపి అంటోంది. రామారావు హత్యతో అంబాపురంలో విషాదం నెలకొంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios