వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. దాడులు, దౌర్జన్యాలతో టీడీపీ కేడర్ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు.

గెలుపు అనేది బాధ్యత పెంచాలి తప్పించి అరాచకాలకు మార్గం కాకూడదని లోకేశ్ హితవు పలికారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో టీడీపీ ఓటేశారని రైతులను ఐదేళ్లు గ్రామం నుంచి బహిష్కరించడాన్ని లోకేశ్ తప్పుబట్టారు.

కొన్ని చోట్ల పేదల గుడిసెలను కూల్చడానికి ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలపై ఇప్పటి వరకు 100కు దాడులు చేయడమేనా.. వైసీపీ చెప్పిన రాజన్న రాజ్యమని లోకేశ్ ప్రశ్నించారు. పోలీసులు తక్షణమే స్పందించి ఇకనైనా ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన పోలీస్ శాఖను కోరారు.