అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షలపై జరుగుతున్న రాద్ధాంతం తారా స్థాయికి చేరింది. చంద్రబాబు నాయుడు, ఎన్నికల సంఘంల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ పై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. 

ఎన్నికల కోడ్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వర్తిస్తుందా అని ట్విట్టర్ వేదికగా నిలదీశారు. చంద్రబాబు రివ్యూలపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతాయా అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపే సమీక్షలల్లో సీఎతోపాటు డీజీపీ సైతం పాల్గొంటున్నారు. 

కేసీఆర్ సమీక్షలపై సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికంగా పత్రికా ప్రకటనలు కూడా చేస్తోంది. అక్కడ కోడ్ వర్తించదా..?ఏంటి ఈ పక్షపాతం అంటూ నిలదీశారు. ఎన్నికల కోడ్ ఒక్క ఏపీలోనే ఉందా అంటూ నిలదీశారు. ఎన్నికల కోడ్ ఒక్క ఏపీలోనే ఉందా అని నిలదీశారు. 

ఈసీ ఆంక్షలన్నీ ఒక్క టీడీపీకే వర్తిస్తాయా అంటూ నిలదీశారు. ఎండలు, తాగునీటి సమస్యలపై సీఎం సమీక్షలు జరిపి చర్యలు తీసుకోకపోతే ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఆలోచించరా అంటూ మండిపడ్డారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకే మీ బుద్ది మారదా అంటూ గట్టిగా హెచ్చరించారు ఈసీని. 

ఇకపోతే ఏపీలో చంద్రబాబు రివ్యూలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అటు రివ్యూలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా సమీక్షల నిర్వహణపై ఆరా తీసింది. అంతేకాదు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల గైడ్ లైన్స్ ని కూడా అభ్యర్థులందరికీ పంపిణీ చేసింది. ఈ నేపథ్యంలో హోంశాఖ సమీక్షను చంద్రబాబు అర్థాంతరంగా ముగించేసిన పరిస్థితి నెలకొంది.