Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణను చూసైనా.. ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి.. నారా లోకేష్

రాష్ట్రంలో పాఠశాలలు ఓపెన్ చేయడం ద్వారా కరోనా వేగంగా వ్యాపించింది. ఎంతోమంది విద్యార్థులు తమ తల్లిదండ్రులను కోల్పోయారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. 

nara lokesh demands 10th, inter exams cancellation in andhra pradesh - bsb
Author
hyderabad, First Published May 21, 2021, 1:19 PM IST

రాష్ట్రంలో పాఠశాలలు ఓపెన్ చేయడం ద్వారా కరోనా వేగంగా వ్యాపించింది. ఎంతోమంది విద్యార్థులు తమ తల్లిదండ్రులను కోల్పోయారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. 

పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో 15 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటారు. 30 వేల మంది ఉపాధ్యాయులు పాల్గొంటారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అందరూ కలిపి 80 లక్షల మందికి కరోనా వచ్చే అవకాశం ఉందని అన్నారు. 

పరీక్షల నిర్వహణ ద్వారా వీరంతా సూపర్ స్ప్రెడర్లుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 9 రాష్ట్రాల్లో పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేశారు. పక్కనున్న తెలంగాణలో పదో తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేశారన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కూడా పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలన్నారు. గతంలో మా పోరాటం ద్వారా పరీక్షలను వాయిదా వేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సరిపోదు. వాయిదా వేయడం కంటే పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. 

టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్: అందరినీ పాస్ చేసిన సబితా ఇంద్రారెడ్డి...

ఇక వ్యాక్సిన్ కు బడ్జెట్ లో కేవలం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించారని, దీని ప్రకారం అందరికీ వ్యాక్సిన్ కోసం ఐదేళ్లు పడుతుందని అన్నారు. 

కాగా, కరోనా ఉధృతి నేపథ్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను ఉత్తిర్ణులను చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు  నిర్ణయం మేరకు అందరిని ఉత్తిర్ణులను చేశామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 

2020-21 విద్యా సంవత్సరంలో భౌతిక తరగతుల నిర్వహణ సాధ్యం కాని సమయంలో డిజిటల్ తరగతులను నిర్వహించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని, ఇది గౌరవ ముఖ్యమంత్రికి విద్యా రంగం పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనమని అన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios