టీడీపీ సీనియర్ నేత, గీతం అధినేత ఎంవీవీఎస్ మూర్తి మరణం పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉదయం ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే షాక్‌కు గురయ్యానని లోకేశ్ తెలిపారు. 

టీడీపీ సీనియర్ నేత, గీతం అధినేత ఎంవీవీఎస్ మూర్తి మరణం పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉదయం ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే షాక్‌కు గురయ్యానని లోకేశ్ తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నిరంతరం ప్రజల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన వ్యక్తి మూర్తి అని కొనియాడారు. కొద్దిరోజుల క్రితం జరిగిన శాసనమండలి సమావేశాల్లో కూడా ప్రజా సమస్యలపై ప్రశ్నించారని లోకేశ్ గుర్తు చేసుకున్నారు.

విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు ఎంవీవీఎస్ కృషి చేశారని ప్రశ్నించారు. 80 ఏళ్ల వయసులో కూడా ప్రజల గురించి ఆలోచిస్తూ.. వారి సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు.

ఎంవీవీఎస్ మూర్తి మరణం.. రోడ్డు ప్రమాదాల్లోనే నేతలను కోల్పోతున్నాం: చంద్రబాబు ఆవేదన

ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం: విశాఖ బయలు దేరిన గంటా

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత, ‘గీతం’ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం