టీడీపీ వ్యవస్థాపకుడు, సినీనటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇప్పటికే ఒక భాగం ప్రేక్షకుల ముందుకు రాగా.. మరో భాగం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

ఈ సినిమాలో నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ నటించినట్లు సమాచారం. మొదటి భాగం పెద్దగా కలెక్షన్లు రాబట్టకపోవడంతో.. రెండో భాగంపై పూర్తి శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే స్పెషల్ ఎట్రాక్షన్ ఉండాలనే ఉద్దేశంతో నారా దేవాన్ష్ తో కొన్ని సీన్లు తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దేవాన్ష్ పాత్ర షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. దేవాన్ష్ తోపాటు కళ్యాణ్ రామ్ కుమారుడు శౌర్య రామ్ కూడా ఇందులో నటించారట. అయితే.. ఈ ఇద్దరు ఏ పాత్రల్లో నటించారనే విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. సినిమా విడుదల అయితే తప్ప ఈ విషయంలో క్లారిటీ రాదు.