తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపి సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా జరుగుతున్నాయి. ఆయన ఇవాళ 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో టిడిపి శ్రేణులు, పార్టీ నాయకులు, వివిధ పార్టీల ప్రముఖులు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వినూత్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఈ క్రమంలో లోకేశ్ భార్య బ్రాహ్మణి  తన మామ పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేశారు. ఎన్టీఆర్ ట్రస్టులో రక్తదానం చేసిన ఆమె మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సవదర్భంగా ''రక్తదానం చేయడం ప్రాణాలు కాపాడండి'' అంటూ బ్రహ్మణి పిలుపునిచ్చారు. ఇలా మామ పుట్టినరోజున రక్తదానం చేసి బ్రాహ్మణి అందరికి ఆదర్శంగా నిలవడమే కాదు ఇలా అరుదైన కానుక అందించారు. 

చంద్రబాబుకు తనయుడుచ మంత్రి నారా లోకేశ్, భార్య భువనేశ్వరి తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి, డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితర ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరంతా ట్విట్టర్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.