ఏపీ సీఎం నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత గ్రామం కృష్ణా జిల్లా కొమరవోలులో పర్యటించారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఆరోసారి వచ్చిన ఆమెకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. తొలుత ఎన్టీఆర్‌, బసవ తారకం విగ్రహాలకు పూలమాలలు వేసి భువనేశ్వరి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ఆమె నడుచుకుంటూ అందర్నీ పలకరించారు. రూ.55లక్షలతో పునర్‌ నిర్మించిన శివాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు భువనేశ్వరి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ శ్రీ బచ్చల అర్జునుడు,   పామర్రు జడ్పీటీసీ శ్రీమతి పొట్లూరి శశి, తెలుగుదేశం నాయకులు శ్రీ  పొట్లూరి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.