హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిందేనని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) డిమాండ్ చేశారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ అనంతపురం జిల్లా కలెక్టర్‌కు అఖలపక్షం నేతలతో కలిసి బాలకృష్ణ వినతిపత్రం అందజేశారు. 

హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిందేనని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) డిమాండ్ చేశారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ అనంతపురం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మికి అఖలపక్షం నేతలతో కలిసి బాలకృష్ణ వినతిపత్రం అందజేశారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. హిందూపురంనే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్దమని మరోసారి స్పష్టం చేశారు. వైసీపీ నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని.. సత్యసాయి జిల్లాగా పేరు పెడితే అభ్యంతరం లేదన్నారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు పోరాటం ఆగదని బాలకృష్ణ స్పష్టం చేశారు.

పుట్టపర్తిని జిల్లాగా చేయడం అక్కడి వారికే ఇష్టం లేదని బాలకృష్ణ అన్నారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే తమ డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచామని.. వారి స్పందనను బట్టి కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ప్రభుత్వాలు నడుచుకోవాలని అన్నారు. మంత్రులకు వాళ్లకుండే అధికారులు లేవని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి.. ప్రాంతీయ విభేదాలు తీసుకురావడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. 

అంతకు ముందు శనివారం ఉదయం హిందూపురం నుంచి బాలకృష్ణ అనంతరపురం బయలుదేరారు. అఖిలపక్షం నేతలతో కలిసి భారీ కాన్వాయ్‌తో బాలకృష్ణ అనంతపురంకు పయనమయ్యారు. లేపాక్షి, చిలమత్తూరు, కొడికొండ మీదుగా అనంతపురానికి చేరుకోనున్నారు. 

ఇక, హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని కొద్ది రోజులుగా ఆందోళన కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కూడా హిందూపురం చేయాలనే డిమాండ్‌‌తో శుక్రవారం మౌన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. హిందూపురంను జిల్లా కేంద్రంగా చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని బాలకృష్ణ తెలిపారు. ఎన్నికల ముందు హిందూపురం జిల్లాగా చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. హిందూపురం కోసం దేనికైనా సిద్ధమని తేల్చిచెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నట్టుగా వెల్లడించారు. మౌనదీక్ష అనంతరం హిందూపురంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన బాలకృష్ణ పలు అంశాలను ప్రస్తావించారు.