దమ్ముంటే.. కేసీఆర్ ఏపీలో ప్రచారం చేయాలని ఏపీ రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు సవాలు విసిరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు జోక్యం చేసుకుంటున్నారని.. ఏపీ ఎన్నికల్లో తామూ వేలుపెడతామని కేటీఆర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. దమ్ముంటే.. కేసీఆర్ .. జగన్ కి మద్దతుగా ఏపీలో ప్రచారం చేయాలని సవాలు చేశారు.

గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆనందబాబు.. కేసీఆర్, జగన్ లపై మండిపడ్డారు. కేసీఆర్ కోసమే.. జగన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయలేదన్నారు. అదేవిధంగా మజ్లిస్, వైసీపీ, జనసేనను కేసీఆర్ నడిపిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తో ప్రతిపక్షాలు ఎలా గెలుస్తాయో చూస్తామన్నారు. ఈ ఎన్నికల్లో కోట్లాది రూపాయలకు ఖర్చు పెట్టి..మరి కేసీఆర్ గెలిచారన్నారు. డబ్బుతో గెలిచిన కేసీఆర్ కి అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు.