మంత్రి లోకేష్..తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. దీంతో.. ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఉత్కంఠకు తెరలేపుతూ.. టీడీపీ స్పష్టత ఇచ్చింది. మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తాడని క్లారిటీ ఇచ్చారు. దీనిపై రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ నాగుల్ మీరా  స్పందించారు.

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నారా లోకేష్ భారీ మెజార్టీతో గెలుస్తారని ఆయన అన్నారు. మోదీకి, వైసీపీకి విజయసాయిరెడ్డి వారధిలా వ్యవహరిస్తున్నారని, వైసీపీ, బీజేపీ చీకటి ఒప్పందంతో కుట్ర రాజకీయాలు చేస్తున్నాయన్నారు. అలాగే వైసీపీ డబ్బు రాజకీయాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, జగన్‌కు ఓటేస్తే కేసీఆర్‌ ఫాంహౌస్‌లో ఉండి పాలన చేస్తారని నాగుల్ మీరా అన్నారు.