Asianet News TeluguAsianet News Telugu

నాగులపల్లి ధనలక్ష్మి: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

Nagulapalli Dhanalakshmi Biography: ఆమె ఒకప్పుడు ఉపాధ్యాయురాలు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే. సామాన్య కుటుంబం నుంచి రాష్ట్ర శాసనసభలోకి అడుగుపెట్టడం ఓ సంచలనమే. ఆమె మరెవరో కాదు వైసీపీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి. ఆమె వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలపై ప్రత్యేక కథనం మీ కోసం.. 

Nagulapalli Dhanalakshmi Biography, Childhood, Family, Education, Political Life, Net Worth, Key Facts KRJ
Author
First Published Mar 28, 2024, 5:12 AM IST

Nagulapalli Dhanalakshmi Biography: ఆమె ఒకప్పుడు ఉపాధ్యాయురాలు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే. సామాన్య కుటుంబం నుంచి రాష్ట్ర శాసనసభలోకి అడుగుపెట్టడం ఓ సంచలనమే. ఆమె మరెవరో కాదు వైసీపీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి. ఆమె వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలపై ప్రత్యేక కథనం మీ కోసం.. 

నాగులపల్లి ధనలక్ష్మి 1986లో ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం కొండూరు గ్రామంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు  వీరబ్బాయి దొర- రఘువ. ధనలక్ష్మి పాఠశాల విద్యాభ్యాసం స్థానిక జిల్లాలోనే సాగింది. ఆ తరువాత రాజమండ్రిలోని ఎస్కే ఆర్ కాలేజ్లో 2011లో బీఏ పూర్తి చేశారు. అనంతరం సెయింట్ జోసెఫ్ కాలేజీ నుంచి బీఈడీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం పొందింది.2013లో రంపు చోడవరం మండలం ఎర్రంపాలెంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలు తెలుగు ఉపాధ్యాయులుగా చేరారు. 

రాజకీయాలపై ఆసక్తి ఉన్న నాగులపల్లి ధనలక్ష్మి ఉపాధ్యాయ వృత్తి రాజీనామా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర సాగించేటప్పుడు రావులపాలెంలో ఆయనను కలిసి పార్టీలో చేరారు. ధనలక్ష్మి తల్లి రాఘవ కొండలు సర్పంచ్ గా 2001 నుంచి 2006 వరకు, 2013 నుంచి 2018 వరకు పనిచేశారు. ఆ విధంగా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంపచోడవరం కాన్స్టెన్సీ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె తన సమీప పర్యటి టిడిపి అభ్యర్థి అయిన వంతుల రాజేశ్వరిపై 3,926 ఓట్ల మెజారిటీతో గెలిచి.. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలా రాజకీయ అరంగేట్రం చేసిన ఏడాదిన్నరకే నాగులపల్లి ధనలక్ష్మి ఎమ్మెల్యేగా గెలుపొంది సంచలన సృష్టించారు.

వాస్తవానికి ఎమ్మెల్యే ధనలక్ష్మి.. ఎన్నికల ముందు..  ఎమ్మెల్యే అవకముందే నియోజకవర్గంలోని పదకొండు మండలాల్లో అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల కష్టనష్టాలను తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముప్పునకు గురవుతున్న ఐదు మండలాల పరిధిలోని గ్రామాల్లో పాదయాత్ర చేశారు. ప్రతి నిర్వాసితుడి సమస్య తెలుసుకున్నారు ఆ విధంగా ఎమ్మెల్యే కాకముందే ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు ధనలక్ష్మి. మొత్తానికి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ధనలక్ష్మి తొలగించే సమస్యల మీద అవగాహన చేసుకుంటూ ముందుకెళుతున్నారు 

ఆమె నియోజకవర్గం గిరిజన ప్రాంతంలో ఉండటంతో ముందుగా ఆసుపత్రుల సమస్యకు చెక్ పెట్టారు. ఇక ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలోనూ ధనలక్ష్మి ముందు ఉంటున్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కంచుకోట అయినా రంపచోడవరంలో మరోసారి విజయ సాధించపార్టీ జెండాను ఎగర వేసేందుకు ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి భావిస్తున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios