Asianet News TeluguAsianet News Telugu

పక్క రాష్ట్రానికెళ్లి మాది ‘‘ఆంధ్రా’’ అంటూ చాలు.. వెటకారపు నవ్వులు, జాలి చూపులు: జగన్‌పై నాగబాబు విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధాని అని హైకోర్టు తీర్పును శిరసావహించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూచించారు జనసేన నేత నాగబాబు. లేని పక్షంలో రాజధాని లేని రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తిగా జగన్ నిలుస్తారంటూ ఆయన ఎద్దేవా చేశారు.
 

nagababu speech at ippatam janasena meeting
Author
Amaravathi, First Published Mar 14, 2022, 6:58 PM IST

దొంగలు రెండు రకాలని.. జనాల్లో వుండే వారు కొందరైతే, రాజకీయాల్లో వుండే వారు రెండో రకానికి చెందిన వారన్నరు జనసేన (janasena) నేత, సినీనటుడు నాగబాబు (naga babu). గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో (ippatam janasena meeting) జరుగుతున్న  జనసేన ఆవిర్భావ సభలో (janasena formation day) ఆయన మాట్లాడుతూ.. మామూలు దొంగ వాచ్, జ్యూవెలరీ, డబ్బును దొంగతనం చేస్తే, రాజకీయాల్లో వుండే దొంగలు మాత్రం మీ భవిష్యత్‌ని, మీ పిల్లల భవిష్యత్‌ని, మీ వృత్తిని, ఉద్యోగాలను, చదువులను , మీ ఆరోగ్యాన్ని, మీ పర్యావరణాన్ని కూడా దోచుకుంటారని నాగబాబు చెప్పారు. 

మామూలు దొంగకి ఎవరిని దోచుకోవాలి, ఎప్పుడు దోచుకోవాలని ఒక నిర్ణయం తీసుకుంటాడని ఆయన అన్నారు. రాజకీయ దొంగల్ని మనం ఎన్నుకుంటామని .. వాళ్లు మనల్ని దోచుకుంటారని నాగబాబు పేర్కొన్నారు. మామూలు దొంగ మనల్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తే.. ప్రతిఘటిస్తామని, యుద్ధం చేస్తామని కానీ రాజకీయ దొంగల్ని ఎవరైనా ఏమైనా అంటే అతన్ని మనం సమర్థించి మనలో మనమే కొట్టుకుచస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

ఆంధ్రప్రదేశ్‌ను మూడు సంవత్సరాలు పాటు రాజధాని లేకుండా పరిపాలించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనంటూ (ys jagan) నాగబాబు ఎద్దేవా చేశారు. రాజధాని రైతుల అకుంఠిత దీక్ష , న్యాయస్థానాల అద్బుతమైన తీర్పు జనసేనాని, జనసేన చేసిన పోరాటం వల్ల మీ ఆంధ్రప్రదేశ్‌కి అమరావతే (amaravathi) రాజధాని అని నిర్ణయించబడిందని నాగబాబు గుర్తుచేశారు. జగన్ ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లకుండా హైకోర్టు తీర్పును శిరసా వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేదంటే రాజధాని లేకుండా ఐదేళ్లు పాలించిన సీఎంగా మిగిలిపోతారంటూ నాగబాబు చురకలు వేశారు. 

మన రాష్ట్ర పరిపాలన గురించి మాట్లాడాల్సి  వస్తే సిగ్గేస్తుందన్నారు. పక్క రాష్ట్రానికి వెళ్లినప్పడు.. మీది ఏ ఏరియా అని అడుగుతూ వుంటారని అప్పుడు  ఆంధ్రా అని చెప్పగానే ఒక వెటకారపు నవ్వు, ఒక జాలి చూపులు కనిపిస్తాయన్నారు. రాష్ట్రంలో రోడ్లు లేవు, పరిశ్రమలు రాలేదని నాగబాబు మండిపడ్డారు. ఏపీలో ప్రజలకు అన్నీ కష్టాలు, కన్నీళ్లేనని నాగబాబు ఫైరయ్యారు. ఏపీలో ప్రతీ పౌరుడి మీదా లక్ష రూపాయల అప్పు వుందని ఆయన పేర్కొన్నారు. మనందరి కోసం వెన్నెముకలాగా నిలబడ్డ నాయకుడు పవన్ కల్యాణ్ (pawan kalyan) అని నాగబాబు చెప్పారు. నిలబడదాం.. తలబడదాం.. గెలుద్దాం, సాధిద్దామన్నారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... నిజాయితీగా పనిచేస్తే ప్రజలు మర్చిపోరన్నారు. వైసీపీ నేతలు భూకబ్జాలు, దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios