Asianet News TeluguAsianet News Telugu

అక్కడికి వెళ్లి తీరుతాం, ఎలా అడ్డుకుంటారో చూస్తాం: నాగబాబు

తాము ఎర్రబాలెం వెళ్లి తీరుతామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామని జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబు అన్నారు. బాధిత రైతులను, మహిళలను పరామర్శించే హక్కు తమకు ఉందని నాగబాబు చెప్పారు.

Nagababu says they will go to Errabalem in Amaravati region
Author
Mangalagiri, First Published Jan 20, 2020, 8:18 PM IST

అమరావతి: అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన కేసులో అరెస్టయిన మహిళలను, రైతులను పరామర్శించే హక్కు తమకు ఉందని జనసేన నేత, సినీ నటుడు నాగబాబు అన్నారు. రైతులకు సానుభూతి తెలిపేందుకుకూడా వెళ్లకుండా తమను పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు. 

మంగళగిరిలోని జనసేన కార్యాలయం వద్ద మీడియాతో నాగబాబు మాట్లాడారు. రాజధాని ప్రాంతంలోని ఎర్రబాలెం వరకు వెల్లి బాధిత మహిళలను, రైతులను పరామర్శిస్తామని, అక్కడికి వెళ్లి తీరుతామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామని ఆయన అన్నారు.

Also Read:రాజధాని గ్రామాల్లో పర్యటనకు పవన్ సిద్దం: జనసేన ఆఫీస్ వద్ద టెన్షన్

బాధిత మహిళలకు, రైతులకు తమ సానుభూతిని తెలిపి నైతిక మద్దతు ఇస్తామని నాగబాబు చెప్పారు. రాజధాని విషయంలో స్థిరమైన నిర్ణయం తీసుకున్నామని, దానికి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. రాజధాని రైతులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. 

కాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి రాజధాని గ్రామాల పర్యటనకు సిద్దమవుతున్నారు. పర్యటనకు వెళ్లవద్దంటూ పోలీసులు ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన కార్యాలయం వద్ద పెద్ద యెత్తున పోలీసులు మోహరించారు. పవన్ కల్యాణ్ బయటకు వస్తే అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధపడ్డారు.

Also Read: పవన్ కళ్యాణ్‌పై తిరుగుబాటు: అసెంబ్లీలో మూడు రాజదానులకు జై కొట్టిన రాపాక

Follow Us:
Download App:
  • android
  • ios