రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యం , ప్రజాసేవలో ప్రాణాలు కోల్పోయిన వారికి జనసేన ఆవిర్భావ సభను అంకితం చేస్తున్నామన్నారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. కోవిడ్ వేళ జన సైనికులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించచారని ఆయన ప్రశంసించారు.
కరోనా (coronavirus) వేళ జన సైనికులు (janasena workers) అనేక ప్రాంతాల్లో అందించిన సేవా కార్యక్రమాలు అపూర్వమని ప్రశంసించారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (political affairs committee) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (nadendla manohar) . గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఇప్పటం రోడ్‌లో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ మహమ్మారితో మృతిచెందిన వారికి సభా వేదిక నుంచి సంతాపం ప్రకటించారు. రోడ్డు ప్రమాదాల్లో, అనారోగ్యం వల్ల, ప్రజాసేవలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ సభను అంకితం చేస్తున్నట్టు మనోహర్ చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు అండగా నిలబడతామని ఆయన భరోసా ఇచ్చారు.
మరోవైపు జనసేన ఆవిర్బావ సభ ప్రాగంణానికి భారీగా జన సైనికులు తరలివచ్చారు. మరికాసేపట్లో జనసేన అధినేత Pawan Kalyan సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. ఈలోపు ప్రసంగిస్తున్న సభా వేదిక పైనుంచి ప్రసంగిస్తున్న జనసేన నేతలు.. ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాబోయేది జనసేన ప్రభుత్వమేనని.. పవన్ కల్యాణ్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, జనసేన ఆవిర్భావ సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మార్చే సామర్థ్యం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కే ఉందని ఆ పార్టీ నేత హరిప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో ల్యాండ్, ఇసుక మాఫియా రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించడంతో పవన్ వల్లే సాధ్యమని అన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు జనసేన కృషి చేస్తోందన్నారు.
ఇక, జనసేన అవిర్భావ సభకు తరలివచ్చే కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టుగా జనసేన నేతలు చెబుతున్నారు. రాష్ట్ర క్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా సభకు ఆహ్వానితులేనని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వీడియో సందేశాన్ని ఆ పార్టీ ఇవాళ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఏపీ భవిష్యత్తు కోసం జనసేన దిశా నిర్ధేశం చేయనుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీన్ని తాము జనసేన ఆవిర్భావ దినోత్సవంగా చూడడం లేదని.. ఏపీ దిశా నిర్ధేశాన్ని చూసే సభగా భావిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేనపై వస్తున్న విమర్శలకు తాము ఈ సభా వేదికగా సమాధానం చెప్పనున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
