కడప: రాయలసీమ విషయంలో మాజీ మంత్రి, కడప జిల్లా రాజకీయ నేత డాక్టర్ ఎంవీ మైసురా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన జరగక ముందు సీమాంధ్ర అనే పేరుండేదని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే ఉందని ఆయన అన్నారు. 

ప్రత్యేక రాష్ట్రం కావాలని సమైక్య రాష్ట్రం కావాలని ఎవరూ కోరలేదని మైసురారెడ్డి శనివారంనాడు అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కేంద్రీకరణ జరగలేదని, అభివృద్ధిని ఒక చోట కేంద్రీకరించడం దురదృష్టకరమని అన్నారు. 

అభివృద్ధిని వికేంద్రీకరించకుంటే ప్రజల నుంచి రాయలసీమ ఉద్యమం తలెత్తుందని మైసురా రెడ్డి హెచ్చరించారు.