విశాఖపట్టణం: విశాఖపట్టణంలోని బుల్లయ్య కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న జ్యోత్స్న మృతిపై పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రేమ వ్యవహరమే జ్యోత్స్న మృతికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

విశాఖపట్టణంలోని అక్కయ్యపాలెం శాంతిపురం దరి కట్టా ఎన్‌క్లేవ్‌లోని నాలుగో అంతస్థులోని లెక్చరర్ అంకుర్ ఫ్లాట్‌లో జ్యోత్స్న రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. 

ఈ ఫ్లాట్‌లోనే బీహార్‌కు చెందిన అంకుర్‌తో పాటు అతని స్నేహితుడు పవన్ కూడ నివాసం ఉంటున్నాడు.  అంకుర్‌తో పాటు పవన్‌ను కూడ ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 

అయితే జ్యోత్స్న వచ్చిన సమయంలో పవన్  ఫ్లాట్‌లోనే ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. జ్యోత్స్న ఫ్లాట్‌కు వచ్చిన తర్వాత అతను...బయటకు వెళ్లిపోయాడా అక్కడే ఉన్నాడా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

జోత్స్న మృతికి అంకుర్‌ కారణమని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఆ రోజు ఏం జరిగిందనే విషయమై  పోలీసులు విచారణ చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌వాసులతో పాటు వాచ్‌మెన్‌ను విచారించారు.  మృతురాలి ఫోన్‌లో ఉన్న మేసేజ్‌లు, ఛాటింగ్‌కు సంబంధించిన వివరాలు సేకరించి దర్యాప్తు  చేస్తున్నారు.

జ్యోత్స్న  ఎవరెవరికి ఫోన్ చేసిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలోనే జ్యోత్స్న రెండు దఫాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కూడ పోలీసులు గుర్తించారు. జ్యోత్స్న చదువుకొనే కాలేజీలో కూడ పోలీసులుదర్యాప్తు చేశారు.  అసలు జ్యోత్స్న మృతికి  అసలు కారణం ఏమిటనే దానిపై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

జ్యోత్స్న మృతి కేసు మిస్టరీ: అప్పుడు పవన్ ఎక్కడ?

అనుమానాస్పద మృతి: ప్రేమిస్తున్నానని వెంటపడిందంటున్న లెక్చెరర్

విద్యార్థిని ఆత్మహత్య: పాత లెక్చరర్ ఇంట్లో ఉరి, పేరేంట్స్ అనుమానాలు