అన్నవరం: తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో ఇద్దరు చిన్నారులతో కలిసి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వేధింపుల వల్లే  తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని  బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

అన్నవరంలోని జూనియర్ కాలేజీ వెనుక నివాసం ఉంటున్న తాళ్లపురెడ్డి సుష్మ రాజ్యలక్ష్మి తన ఇద్దరు కొడుకులు సాత్విక్, యువన్‌లు సోమవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

తాము ఇంట్లో లేని సమయంలో  రాజ్యలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి  మామ చందర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే  తమ కూతురును భర్త, అత్త, మామలు  వేధింపులకు పాల్పడేవారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

విశాఖపట్టణం జిల్లా నాతవరం మండలం కిత్తనాయుడు పాలెం గ్రామానికి చెందిన సుష్మరాజ్యలక్ష్మి 2013లో అన్నవరానికి చెందిన  తాళ్లపురెడ్డి వెంకటరమేష్‌తో వివాహమైంది. వివాహసమయంలో రెండు లక్షలను కట్నంగా ఇచ్చారు.

అత్తింటి వాళ్లు తనను వేధింపులకు గురిచేసేవాళ్లని తన కూతురు తమకు చెప్పేదని  కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత మాసంలో పండుగకు తమ ఇంటికి వచ్చిందని తల్లిదండ్రులు గుర్తు చేశారు.

ఈ నెల 6వ తేదీన అన్నవరానికి పంపించినట్టుగా తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. తమ ఇంటి నుండి వచ్చిన మూడు రోజులకే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా చెప్పారు.