Asianet News TeluguAsianet News Telugu

మైదుకూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

మైదుకూరు పేరు చెప్పగానే డీఎల్ రవీంద్రా రెడ్డి, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్‌లు గుర్తొస్తారు. 1983 నుంచి రవీంద్రారెడ్డి, రఘురామిరెడ్డిలు తలపడుతూ వస్తున్నారు. మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 2,07,957 మంది ఓటర్లున్నారు. ఈ సెగ్మెంట్‌లో దువ్వూరు, మైదుకూరు, ఖాజీపేట, బ్రహ్మంగారిమఠం, చాపాడు మండలాలున్నాయి. పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశం పార్టీలో తెరపైకి వచ్చారు. 2014, 2019లలో ఆయన టీడీపీ తరపున.. రఘురామిరెడ్డితో తలపడ్డారు. రెండు సార్లూ హోరాహోరీ పోరు నడిచినప్పటికీ శెట్టిపల్లే విజయం సాధించారు. మైదుకూరు నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలన్నది సుధాకర్ యాదవ్ కల.  జగన్‌పై వ్యతిరేకత, టీడీపీ జనసేన బీజేపీ కూటమి, వరుసగా రెండు సార్లు ఓడిన సానుభూతి తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
 

Mydukur Assembly elections result 2024 ksp
Author
First Published Mar 19, 2024, 8:54 PM IST

కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే వుంటాయి. అధినేతలు, పార్టీలతో పాటు ఇక్కడ వ్యక్తిగత ప్రతిష్ట కూడా ప్రభావం చూపుతూ వుంటుంది. మైదుకూరు పేరు చెప్పగానే డీఎల్ రవీంద్రా రెడ్డి, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్‌లు గుర్తొస్తారు. దశాబ్ధాలుగా డీఎల్, శెట్టిపల్లిలు ఇక్కడ ఆధిపత్యం కోసం పోరాడారు. ఇద్దరు వేర్వేరు పార్టీల తరపున పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలకపాత్ర పోషించారు. 1983 నుంచి రవీంద్రారెడ్డి, రఘురామిరెడ్డిలు తలపడుతూ వస్తున్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత మైదుకూరులో రాజకీయాలు మారిపోయాయి. కాంగ్రెస్ భూస్థాపితం కావడంతో డీఎల్ రవీంద్రారెడ్డి సైలంట్ అయ్యారు. 

మైదుకూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. దశాబ్ధాలుగా డీఎల్ రవీంద్రా రెడ్డి ఆధిపత్యం :

మైదుకూరును శాసించిన  కాంగ్రెస్ పార్టీ స్థానంలో వైసీపీ వచ్చి చేరింది. టీడీపీలో వున్న రఘురామిరెడ్డి .. వైసీపీలో చేరారు. సరిగ్గా ఇదే సమయంలో పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశం పార్టీలో తెరపైకి వచ్చారు. 2014, 2019లలో ఆయన టీడీపీ తరపున.. రఘురామిరెడ్డితో తలపడ్డారు. రెండు సార్లూ హోరాహోరీ పోరు నడిచినప్పటికీ శెట్టిపల్లే విజయం సాధించారు.

అయితే 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో పుట్టాకు టీటీడీ బోర్డ్ చైర్మన్ పదవి దక్కడంతో పాటు నియోజకవర్గంలోనూ ఆయన చక్రం తిప్పారు. కానీ మైదుకూరు నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలన్నది సుధాకర్ యాదవ్ కల. వియ్యంకుడు యనమల రామకృష్ణుడు అండగా.. చంద్రబాబు వద్ద మంచి పలుకుబడి వుండటంతో ఆయనకే ప్రతిసారి టికెట్ దక్కుతోంది. ఆర్ధికంగా, సామాజికపరంగా బలమైన వ్యక్తి కావడంతో చంద్రబాబు సైతం సుధాకర్ యాదవ్‌కే టికెట్ కేటాయిస్తున్నారు. 

మైదుకూరు శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. పుట్టాకి ఈసారైనా ఛాన్సిస్తారా : 

మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 2,07,957 మంది ఓటర్లున్నారు. ఈ సెగ్మెంట్‌లో దువ్వూరు, మైదుకూరు, ఖాజీపేట, బ్రహ్మంగారిమఠం, చాపాడు మండలాలున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి శెట్టిపల్లి రఘురామిరెడ్డికి 94,849 ఓట్లు, టీడీపీ అభ్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్‌కు 65,505 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 29,344 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.

2024లో మరోసారి గెలిచి మైదుకూరులో హ్యాట్రిక్ నమోదు చేయాలని జగన్ భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి మరోసారి టికెట్ ఖరారు చేశారు . టీడీపీ విషయానికి వస్తే పుట్టా సుధాకర్ యాదవ్ మూడోసారి బరిలో దిగుతున్నారు. జగన్‌పై వ్యతిరేకత, టీడీపీ జనసేన బీజేపీ కూటమి, వరుసగా రెండు సార్లు ఓడిన సానుభూతి తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios