అమరావతి : ఫాదర్స్‌ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిని గుర్తుచేసుకున్నారు. 

ఈ మేరకు ఆదివారం ట్విట్టర్‌ వేదికగా భావోద్వేగ పోస్ట్‌ చేశారు. నాన్నే నా బలం, ఆదర్శం. జీవితంలోని ప్రతి కీలక ఘట్టంలో నాన్నే నాకు స్ఫూర్తి అని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

 

 ప్రతీ తండ్రి పిల్లల గెలుపు కోసం ప్రయత్నిస్తాడు. పిల్లలకు ప్రేమను.. స్ఫూర్తిని పంచుతారన్నారు. కష్టకాలంలో అండగా ఉంటారు, ప్రేమిస్తారు. నాన్నే మనకు తొలి స్నేహితుడు, గురువు, మన హీరో అని ఆయన చెప్పారు.

 మన సంతోషాలన్నీ నాన్నతోనే పంచుకుంటాం, ప్రతీ తండ్రికి ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు అంటూ వైఎస్సార్‌‌తో కలిసి దిగిన ఫోటోను ఆయన పోస్టు చేశారు.