గుంటూరులో జగన్ కి షాక్

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 1, Sep 2018, 12:05 PM IST
muslim leaders shock to ys jagan in guntur
Highlights

‘నారా హఠావో- ముస్లిం బచావో’’ పేరిట వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. వైసీపీ కార్యక్రమాలను గుంటూరు జిల్లాలోని ముస్లింలు వ్యతిరేకించారు.

గుంటూరు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ కి షాక్ తగిలింది. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ముస్లింలకు న్యాయం జరగదంటూ.. ‘‘నారా హఠావో- ముస్లిం బచావో’’ పేరిట వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. వైసీపీ కార్యక్రమాలను గుంటూరు జిల్లాలోని ముస్లింలు వ్యతిరేకించారు.

నారా హమారా - టీడీపీ హమారా సభలో వైసీపీ కుట్రలకు వ్యతిరేకంగా శనివారం జిల్లాలో ముస్లిం సోదరులు ఆందోళనకు దిగారు. నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. మార్కెట్‌లోని గాంధీ విగ్రహం నుంచి బస్టాండ్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ కుట్ర రాజకీయాలకు ముస్లిం సోదరులు బలికావద్దని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.

loader