కర్నూలు: ఆధునిక యుగంలో కూడా మూఢ నమ్మకాల పేరుతో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. మూఢనమ్మకాల పేరుతో దేశంలో ఏదో ఒకమూల ఏదో ఒక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 

గుప్త నిధుల కోసం ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు నరబలి ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా సిరివేళ్ల సమీపంలోని నరసింహ స్వామి దేవాలయం సమీపంలో ఒక యువకుడి శవం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. 

అయితే మృతదేహం మెుండెం, తల వేర్వేరుగా పడి ఉన్నాయి. దీంతో గుప్త నిధుల కోసమే నరబలి ఇచ్చి ఉంటారని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థుల సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.