గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. ఓ యువకుడిపై నడిరోడ్డుపై పట్టపగలు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. వీరంశెట్టి  కిశోర్ కుమార్ అనే వ్యక్తి బైక్‌పై వెళుతుండగా మార్కెట్ వంతెన వద్ద ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.

దాడిలో తీవ్రంగా గాయపడిన కిశోర్‌ను పోలీసులు తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.