Asianet News TeluguAsianet News Telugu

మంత్రి పెద్దిరెడ్డి తెలుసంటూ... నిరుద్యోగులకు వల: ప్రభుత్వోద్యోగి అరెస్ట్

కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న పోరు మామిళ్ల రమేశ్ బాబు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మా తాలుకానే అని.. ఎంపీ మిథున్ రెడ్డి మా బంధువేనని.. రూ.5 లక్షలిస్తే డైరెక్ట్‌గా పంచాయతీ కార్యదర్శి పోస్ట్ ఇప్పిస్తానని పలువురిని నమ్మించాడు

Municipal employee, aides arrested for cheating unemployed youth in kadapa
Author
Kadapa, First Published Aug 28, 2019, 8:00 AM IST

సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల పేర్లను అడ్డం పెట్టుకుని అమాయకులను మోసం చేసిన కేటుగాళ్లను ఎంతోమందిని చూశాం. తాజాగా మంత్రి పేరు చెప్పి.. నిరుద్యోగులను మోసం చేయాలని ప్లాన్ వేసి అడ్డంగా దొరికిపోయాడో వ్యక్తి.

వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న పోరు మామిళ్ల రమేశ్ బాబు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మా తాలుకానే అని.. ఎంపీ మిథున్ రెడ్డి మా బంధువేనని.. రూ.5 లక్షలిస్తే డైరెక్ట్‌గా పంచాయతీ కార్యదర్శి పోస్ట్ ఇప్పిస్తానని పలువురిని నమ్మించాడు.

ఆ తర్వాత సోషల్ మీడియాలో సైతం ఇదే తరహా ప్రచారానికి దిగాడు. ఈ విషయం మంత్రి పెద్దిరెడ్డి దాకా వెళ్లడంతో... ఆయన సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రమేశ్‌ బాబును అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios