అమరావతి: కాపుల చిరకాల కోరిక అయిన రిజర్వేషన్లకు సంబంధించి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక  ఎందుకో వెనుకడుగు వేస్తున్నారని కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. ఈ మేరకు గతంలో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ముఖ్యమంత్రి జగన్ కు ముద్రగడ ఓ బహిరంగ లేఖ రాశారు. 

''మీరు అడిగిన వారికి, అడగని వారికి హామీలు ఇవ్వని,ఇచ్చిన వారికి దానాలు చేసి దానకర్ణుడు అనిపించుకుంటున్నారు. మా జాతి చిరకాల కోరిక పోగొట్టుకున్న బిసీ రిజర్వేషన్ల కోసం చేసిన పోరాటానికి మీ అనుమతితో మీ పార్టీ నేతలు పూర్తి మద్దతు ఇచ్చారు.2016 ఫిబ్రవరి 1 మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ మా జాతి కోరిక సమంజసం అని చెప్పారట. అసెంబ్లీ లో కూడా మద్దతు ఇచ్చారని విన్నాను'' అని ముద్రగడ గుర్తు చేశారు.

read more   కంగారు పడుతున్నట్లున్నారు, అది ప్రభుత్వం తప్పుకాదండీ: జగన్ కు ముద్రగడ లేఖ

''ఈరోజు మా కోరిక దానం చేయడానికి మీకు చేతులు ఎందుకు రావడం లేదు. మీ విజయానికి మాజాతి సహకారం అన్ని చోట్ల పొందలేదా.  ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి మాజాతిని, ఉద్యమాన్ని, పోలీసులతో అణచివేసిన దమనకాండ, అరాచకాలు, అవమానాలు మీ ఛానల్ లో చూపించిందే చూపించి మాజాతి ఓట్లు పొందలేదా?'' అని ప్రశ్నించారు. 

వీడియో

"

''పాలకులు ప్రజల కష్టాలలో పాలుపంచుకోవాలి. నవీన్ పట్నాయక్, జ్యోతిబసు, వైఎస్సార్ లా పూజలందుకోవాలి కానీ పదవి మూణాళ్ళ ముచ్చటగా చేసుకోకండి. మాజాతి రిజర్వేషన్ల కోసం ప్రధాని మోడీని కోరండి'' అని సిఎం జగన్ కు రాసిన లేఖ లో ముద్రగడ పేర్కొన్నారు.