వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ లపై మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా వారిపై కౌంటర్లు వేశారు. వాళ్లు అధికారంలో ఉన్న సమయంలో ప్రజల సొమ్ము నొక్కేసారని.. దానిని త్వరలోనే బయటపెడతానని ఆయన చెప్పడం గమనార్హం.

Also Read పెరిగిన బాబు ఆస్తులు:ఫ్యామిలీ ఆస్తులను వెల్లడించిన నారా లోకేష్..

‘‘తండ్రేమో తన ఆస్థి లక్ష కోట్లని వేల మంది సాక్షిగా ప్రకటించాడు. చిట్టినాయుడేమో ఆస్థుల వివరాలంటూ, ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లలో దుమ్ముకొడతాడు. ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసిందీ త్వరలోనే బయట పడుతుంది. అప్పుటిదాకా ఆ కాయితాలు భద్రంగా దాచుకో చిట్టీ!’’ అంటూ చంద్రబాబు, లోకేష్ లను విమర్శిస్తూ విజయసాయి ట్వీట్ చేశారు. 

 

కాగా... ఇటీవల చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. అతను చంద్రబాబు బినామీ అంటూ అధికార పార్టీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో  లోకేష్ తమ ఆస్తి వివరాలు ఇవేనంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. జగన్ కూడా తన ఆస్తుల వివరాలను తెలియజేయాలని.. అంత ఆస్తులు జగన్ కి ఎలా పెరిగాయో చెప్పాలంటూ లోకేష్ పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలోనే లోకేష్ పై విజయసాయి సెటైర్లు వేశారు. ఈ ట్వీట్లకు నెటిజన్ల నుంచి కూడా స్పందన బాగానే వస్తోంది. కొందరు టీడీపీకి మద్దతుగా మాట్లాడుతుంటే.. మరికొందరు జగన్ ని మద్దతు ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు.