ఎన్టీఆర్ వర్ధంతి నాడే చంద్రబాబుకు కరోనా సోకడం బాధాకరం.. విజయ్ సాయిరెడ్డి వ్యంగ్యం...
బాబుకు వచ్చిన కరోనా తగ్గిపోతుందిలేగానీ.. టీడీపీ వ్యవస్థాపకుడికి ఆయన పొడిచిన వెన్నుపోటు మాత్రం తెలుగుజాతి ఉన్నంత వరకూ గుర్తుండిపోతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాగా, తనకు కరోనా సోకిందని, లక్షణాలు అతి స్వల్పంగా ఉన్నాయని పేర్కొంటూ చంద్రబాబు వెల్లడించారు.
టీడీపీ అధినేత chandrababu naiduకు కరోనా సోకడంపై ఏపీ ముఖ్యమంత్రి YS jagan, ఎంపీ vijay sai reddy స్పందించారు. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యవంతంగా ఉండాలని జగన్ ఆకాంక్షించారు. అయితే, విజయసాయిరెడ్డి మాత్రం కొంత వ్యంగ్యంగా స్పందించారు. యాధృచ్ఛికమే అయినా ఎన్టీఆర్ వర్ధంతి నాడే చంద్రబాబుకు కరోనా సోకడం బాధాకరమని tweet చేశారు.
బాబుకు వచ్చిన కరోనా తగ్గిపోతుందిలేగానీ.. టీడీపీ వ్యవస్థాపకుడికి ఆయన పొడిచిన వెన్నుపోటు మాత్రం తెలుగుజాతి ఉన్నంత వరకూ గుర్తుండిపోతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాగా, తనకు కరోనా సోకిందని, లక్షణాలు అతి స్వల్పంగా ఉన్నాయని పేర్కొంటూ చంద్రబాబు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే క్వారంటైన్ అయిన సంగతి తెలిసిందే. ఇటు ఆయన కుమారుడు నారా లోకేశ్ కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
తెలుగుదేశం పార్టీ అధినేత Chandrababu naidu కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ సీఎం YS Jagan ట్వీట్ చేశారు. చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం కావాలని కోరకుంటున్నట్టుగా సీఎం జగన్ తన ట్విట్టర్ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇక, తనకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన విషయాన్ని చంద్రబాబు నాయుడు మంగళవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా టెస్టులో తనకు పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని వివరించారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో హోం క్వారంటైన్‌లో ఉండనున్నట్టు తెలిపారు. తనతో కాంటాక్టులోకి వచ్చిన వారూ కరోనా టెస్టు చేసుకోవాలని కోరారు. తన కుమారుడు నారా లోకేష్ కూడా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. లోకేష్‌కు కరోనా సోకిన తర్వాతి రోజే చంద్రబాబుకూ పాజిటివ్ అని తేలింది.
ఇదిలా ఉండగా తాజాగా వైసీపీ నేత.. డిప్యూటీ సీఎం, రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి Dharmana Krishnadasకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇదే విషయాన్ని ఆయన మంగళవారం ఉదయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనకు లక్షణాలు పెద్దగా ఏవీ లేవని అయినప్పటికీ Home Isolationను పాటిస్తున్నట్టు తెలిపారు. కోవిడ్ నియమావళిని కచ్చితంగా పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని, అంతకు ముందే సంక్రాంతి సందర్భంగా క్యాంపు కార్యాలయానికి కూడా సెలవు ప్రకటించామని తెలిపారు.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు virus సోకిందని, అయితే ఎవరూ అందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇటీవల తనను కలిసినవారు కూడా covid tests చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా సోకిన వారిలో నారా లోకేష్, దేవినేని ఉమ కూడా ఉన్నారు. అంతకు ముందు మంత్రి బాలినేని భార్యకు కూడా కరోనా పాజిటివ్ తేలింది. ఇక కొడాలి నాని, వంగవీటి రాధాలు కూడా కరోనాతో హైదరాబాద్ లోని ఏఐజీలో చికిత్స తీసుకుంటున్నారు.