బ్రేకింగ్: బెయిల్ రద్దు పిటిషన్... జగన్ కు సిబిఐ కోర్టు నోటీసులు

 జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామకృష్ణంరాజు పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తాజాగా సీఎంకు నోటీసులు జారీ చేసింది. 

MP Raghuramakrishnam Raju Petition... CBI Court Serve Notoce to  CM YS Jagan akp

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామకృష్ణంరాజు పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తాజాగా నోటీసులు జారీ చేసింది. బెయిల్ నిబంధనలను జగన్ ఉల్లంఘిస్తున్నారన్న ఎంపీ రఘురామ వాదనకు వివరణ ఇవ్వాలంటూ సీబీఐ కోర్టు నోటీసుల్లో పేర్కొంది. రఘురామకృష్ణంరాజు పిటిషన్ పై వచ్చే నెల 7న మళ్లీ విచారణ చేపట్టనుంది సీబీఐ కోర్టు. ముఖ్యమంత్రి జగన్ కు నోటీసులు జారీ అవ్వడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 

ఇటీవలే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. సీఎం జగన్‌ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. బెయిల్‌ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని కోరారు.  

నాంపల్లి సీబీఐ కోర్టులో తాను వేసిన పిటిషన్‌ మొదట్లో సాంకేతిక కారణాల వల్ల న్యాయస్థానం తిరస్కరించిందని రఘురామ వెల్లడించారు. ఆ తర్వాత సవరణలు చేసి తిరిగి పిటిషన్‌ వేయడంతో న్యాయస్థానం స్వీకరించినట్లు నర్సాపురం ఎంపీ వివరించారు.

read more  జగన్ బెయిల్ రద్దు... సిబిఐ కోర్టులో మా వాదన సాగిందిలా...: రఘురామకృష్ణంరాజు

దీని ప్రకారం ఇప్పుడు ముఖ్యమంత్రికి, సీబీఐకి న్యాయస్థానం నోటీసులు ఇస్తుందని రఘురామ పేర్కొన్నారు.  ఉన్నత పదవుల్లో ఉన్న వారే న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వకపోతే పౌరులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిని దృష్టిలో ఉంచుకునే తాను ఈ పోరాటం మొదలు పెట్టానని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు.  

అంతకుముందు సీబీఐ కోర్టులో ఏ-1గా ఉన్న ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌‌ను రద్దు చేయాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జగన్మోహన్‌రెడ్డి 11 సీబీఐ ఛార్జిషీట్లలో ఏ-1గా ఉన్నారని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా.. తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాలన్న ఉద్దేశంతోనే పిటిషన్ వేసినట్టు ఎంపీ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకోవాలని, జయలలిత, లాలూ తదితరులు తమ స్థానంలో వేరే వారికి సీఎంగా ఛాన్స్ ఇచ్చినట్టే జగన్ కూడా వేరొకరికి అవకాశమిచ్చి.. కేసుల నుంచి బయటపడాలని ఎంపీ హితవు పలికారు.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios